Pushpa-2: పుష్ప-2 లో చూపించినట్టే సీఎం మార్పు.. రేవంత్ రెడ్డి కుర్చీ కింద బాంబ్.?
Pushpa-2: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఏం మాట్లాడినా ముక్కు సూటిగా మాట్లాడుతారు. అలాంటి రేవంత్ రెడ్డిని సంధ్య థియేటర్ ఘటనలో ఇరికించడం దారుణం. పుష్ప2 సినిమా వల్ల ఒక మహిళ చనిపోవడం ఆమె కుమారుడు ఆపస్మారక స్థితికి పోవడం ఒక ఫ్యామిలీ కుప్పకూలిపోవడం జరిగింది. దీంతో అల్లు అర్జున్ పై తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టడంతో రేవంత్ రెడ్డి ఇదంతా చేయించారని ఒక రూమర్ క్రియేట్ చేసి అంత హంగామా చేస్తూ వస్తున్నారు..
CM change as shown in Pushpa-2
దీంతో కోపానికి వచ్చిన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ రేవతికి అండగా నిలవాలని సినీ ఇండస్ట్రీలోని అల్లు అర్జున్ ని తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు అరెస్టు కూడా చేయించి కొన్ని గంటల పాటు జైల్లో ఉంచారు. ఈ వ్యవహారం జరిగిన తర్వాత తెలంగాణ మొత్తం రేవంత్ రెడ్డి వైపు ఉంది. కానీ కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డిని ఈ వ్యవహారంలో ఇరికించి సీఎం సీట్ నుంచి దించాలని చూస్తున్నారట. దీనికోసం అల్లు అర్జున్ ను వాడుకుంటున్నారని తెలుస్తోంది. (Pushpa-2)
Also Read: Ram Charan: పుష్ప-2 పై మాట్లాడిన రామ్ చరణ్..బన్నీని అవమానించి..?
ముఖ్యంగా పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ కు సీఎం నచ్చకపోతే మార్చేసినట్టే ఇందులో కూడా రేవంత్ రెడ్డి ని మార్చేసి వారికి అనుకూలమైన సీఎంను పెట్టుకోవాలని చూస్తున్నారని తాజాగా అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి ఓ మీడియా సమావేశంలో చెప్పడం సంచలనంగా మారింది. అల్లు అర్జున్ ను ఒక మహాశక్తి నడిపిస్తుందని, అందువల్లే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనంగా మారుతుందని చెప్పారు.
అల్లు అర్జున్ ఒక రాజకీయ పార్టీకి చేతిలో పావుగా మారారని, పుష్ప2 సినిమా లాగానే రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కొన్ని రోజుల నుంచి దీనికి సంబంధించిన భారీ స్కెచ్ రెడీ అయిందని, వచ్చే వారం రోజుల్లో రేవంత్ సర్కార్ ను పడగొట్టడానికి పెద్ద కుట్ర చేశారని, దీనికోసం బిజెపి గులాబీ నాయకుల ప్లాన్ తీసుకున్నారని తెలియజేశారు. ప్రస్తుతం ఆయన అన్న ఈ మాటలు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ప్రజలంతా రేవంత్ రెడ్డికి రేవతికి అండగా నిలవాలని ఆయన కోరారు.(Pushpa-2)