CM Revanth Reddy: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకు 20 లక్షలు ప్రకటించిన రేవంత్!!


CM Revanth Reddy Announces Farmers Compensation

CM Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లో మూడు రోజుల పాటు జరిగిన రైతు పండుగ ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో పాలమూరుకు సంబంధించిన అనేక కీలక ప్రకటనలు చేస్తూ, లగచర్ల రైతులకు అదిరిపోయే శుభవార్త ఇచ్చారు. ముఖ్యంగా, రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన భూసేకరణ అంశంపై ఆయన స్పందించారు.

CM Revanth Reddy Announces Farmers Compensation

లగచర్లలో పారిశ్రామిక వాడ నిర్మాణం కోసం చేపడుతున్న భూసేకరణను ప్రతిపక్షాలు ఇవ్వనీయకుండా చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అమాయక రైతులను రెచ్చగొట్టిన బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి, రైతులు అధికారులు మరియు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దాడులకు దిగారని విమర్శించారు. అభివృద్ధి కోసమే భూసేకరణ అని దీనికి రైతుల సహకారం అవసరమని ఆయన స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో పరిశ్రమలు అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, ఇక్కడ భూసేకరణ జరిపి పారిశ్రామిక రంగానికి ఉత్సాహం పెంపొందించనున్నామని తెలిపారు.

Also Read: Mahesh Babu: ఆ సినిమా ను మిస్ చేసి పెద్ద తప్పు చేసిన మహేష్ బాబు.. తలరాత అంటే ఇదే!!

రాష్ట్రంలో గతంలో జరిగిన ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ, అభివృద్ధి చేయడానికి అప్పట్లో కూడా భూసేకరణ జరిగిందని, కానీ ఇప్పుడేమో బీఆర్ఎస్ నేతలు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలకు నష్టం కలిగించకుండా న్యాయబద్ధంగా పరిహారం అందించడమే తమ ధ్యేయమని అన్నారు. భూమి అమ్మతో సమానమని, రైతులు తమ భూములపై ఉండే అనుబంధం తనకు బాగా తెలుసు అని వ్యక్తీకరించారు. భూమి కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అందించడంపై సీఎం హామీ ఇచ్చారు.

ఈ ప్రకటనతో రైతుల ఆందోళనలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. రైతులకు తగిన న్యాయం చేస్తామనే నమ్మకాన్ని కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రైతులు తమ భూములు ఇచ్చి సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. “ఇచ్చేది పాలమూరు బిడ్డనే” అంటూ, తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని రేవంత్ రెడ్డి ధృడంగా పేర్కొన్నారు. ఆయన మాటలు రైతులకు ఒక నమ్మకాన్ని, ఒక భరోసాను అందించాయని చెప్పుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *