CM Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ళు ఇయ్యకపోతే..ఓట్లు అడుగను !
CM Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ళు ఇయ్యకపోతే..ఓట్లు అడుగను అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాజాగా పాలమూరు జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. సంవత్సరంలో 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని… స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇయ్యని ఊర్లల్లో ఓట్లు అడగబోమని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy Comments on Indhiramma indlu
పాలమూరు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతలను గెలిపించి నన్ను ముఖ్యమంత్రిని చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నా జిల్లాను అభివృద్ధి చేయడానికి ఈ రాష్ట్ర బడ్జెట్ నుండి ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చుపెడుతానని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంఆణ రాష్ట్రంలో పలు జిల్లాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడికి చదువుకోడానికి రావడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వ పెద్దల కృషి వలన 8 కొత్త మెడికల్ కళాశాల లు రావడం జరిగిందని… టీచింగ్ స్టాఫ్ ఉండటం ముఖ్యమని చెప్పారు. మీరు చదువుకుని వెళ్లి ప్రజలకు సేవలు అందించాలని కోరారు. పేదలకు చదువు అందుబాటులో కి వచ్చినప్పుడే రాష్ట్రం అభివృద్ధి బాటలోకి వస్తుందని వెల్లడించారు. విదేశాలలో పారా మెడికల్ స్టూడెంట్స్ కు చాలా డిమాండ్ ఉందన్నారు. ముందుముందు ఆసుపత్రి పూర్తిస్థాయిలో ఇక్కడికి షిఫ్ట్ చేస్తామని ప్రకటన చేశారు. బూర్గుల తర్వాత పాలమూరు జిల్లా నుండి నాకు సీఎం గా చేసే అవకాశం వచ్చిందన్నారు. మెడికల్ కళాశాలకు దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి పేరు పెట్టె విధంగా చూడాలని అధికారులను కోరారు.
https://twitter.com/TeluguScribe/status/1892898167911252409