CM Revanth Reddy: కేటీఆర్ పిచ్చోడు.. కేసీఆర్ చెల్లని రూపాయి.. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు!!

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చిట్ చాట్ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చెల్లని రూపాయిలాంటివారని, ఆయన గురించి మాట్లాడడం అనవసరమని పేర్కొన్నారు. కేటీఆర్‌ను పిచ్చోడిగా అభివర్ణిస్తూ, ఆయన ఎలాంటి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
CM Revanth Reddy criticizes KCR, KTR
ప్రాజెక్టుల అభివృద్ధికి లోన్లు తీసుకోవాల్సి ఉంటుందని, అయితే, అవన్నీ బడ్జెట్ పరిమితుల్లోనే ఉంటాయని సీఎం తెలిపారు. రాష్ట్రం అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని, కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తగిన నిధులను తెచ్చేందుకు విఫలమయ్యారని ఆరోపించారు. రింగ్ రోడ్డు పూర్తిగా ఉండాల్సిందేనని, సగం చేసి రింగ్ రోడ్డు అనడం అర్థరహితం అని అన్నారు. మోదీ ప్రభుత్వం ప్రకటించిన రీజినల్ రింగ్ రోడ్డు ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
జైపాల్ రెడ్డి తీసుకొచ్చిన మెట్రో ప్రాజెక్టే ఇప్పటికీ కొనసాగుతుందని, అయితే, కిషన్ రెడ్డి హయాంలో మెట్రో అభివృద్ధి ఏమైంది అని నిలదీశారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రానిదని, కానీ దాని అమలుపై స్పష్టత లేదని విమర్శించారు.
భట్టి విక్రమార్క పిలిచిన సమావేశానికి బీజేపీ నేతలు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. మనోహర్ ఖట్టర్ సమావేశానికి కూడా కిషన్ రెడ్డి హాజరుకాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు చెల్లించే పన్నులకు తగిన రిటర్న్ కేంద్రం ఇస్తుందా? కేంద్రం ఇచ్చిన నిధులు లెక్కలు చూపించాలన్నారు. కేంద్రం నిజాయితీగా ఉందని తేలితే, తానే స్వయంగా సన్మానం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.