Cm Revanth Reddy: కొడంగల్ కు గుడ్ బాయ్.. కొత్త నియోజకవర్గం వేటలో రేవంత్ ?


Cm Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొడంగల్ నియోజకవర్గాన్ని ఆయన వదిలేయనున్నట్లు.. చెబుతున్నారు. అందుకే కొడంగల్ నియోజకవర్గ ప్రజల పట్ల.. దయ లేకుండా వ్యవహరిస్తున్నారని గులాబీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా కొడంగల్ నియోజకవర్గం గురించి సంచలన వార్తలు వస్తున్నాయి. Cm Revanth Reddy

Cm Revanth Reddy Key Decision On Kodangal

ఈ వార్తల ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదని… ఓ సర్వే తేల్చి చెప్పిందట. అక్కడ తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని అంటున్నారు. గతంలో తెలంగాణను వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డి పైన ఎక్కువ వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. Cm Revanth Reddy

Also Read: RCB Twitter Post: వివాదంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఫైర్ అవుతున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్!!

అయితే ఇలాంటి పరిణామాలు నేపథ్యంలో రేవంత్ రెడ్డి.. కొడంగల్ నియోజకవర్గం నుంచి తప్పుకోనున్నారని సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందట. ఈ లెక్కన… కల్వకుర్తిలో రేవంత్ రెడ్డి సొంత గ్రామం పడుతుందని అంటున్నారు. అప్పుడు కల్వకుర్తికి జనరల్ కేటగిరి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. దాంతో వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తికి రేవంత్ రెడ్డి షిఫ్ట్ కాబోతున్నారని… ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. Cm Revanth Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *