CM Revanth Reddy: తెలంగాణాలో రైతులు దొడ్డు వడ్లు పండించకండి?
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చాడు. దొడ్డు వడ్లు పండించకూడదని ఆయన కోరడం జరిగింది. తెలంగాణాలో రైతులు దొడ్డు వడ్లు పండించకండి.. దొడ్డు బియ్యం ఎవరు తినడం లేదు అంటూ బాంబు పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం సన్న వడ్లకే… 500 రూపాయల బోనస్ ఇస్తున్న నేపథ్యంలో… అందరూ సన్న వడ్లు పండించాలని అంగిలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. CM Revanth Reddy

CM Revanth Reddy on Paddy
అయితే రేవంత్ రెడ్డి దొడ్డు వడ్ల పైన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణలో ఎక్కువ శాతం పండేవి దొడ్డు బియ్యం అన్న సంగతి తెలిసిందే. సన్న వరి పండాలంటే చాలా కష్టపడాలి. సన్న వడ్లు పండించిన రైతుకు న్యాయం సరిగా జరగడం లేదు. దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి.. దొడ్డుబడ్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పండుతాయి… కాబట్టి తెలంగాణ రైతులంతా… సన్న రకం కాకుండా… దొడ్డు వడ్లు మాత్రమే పండిస్తారు. CM Revanth Reddy
Also Read: Aryaman Birla: వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్.. ధోని కోహ్లీని మించిన సంపద ?
అయితే గతంలో కేసీఆర్ కూడా ఇదే మాట చెబితే రైతులంతా ఏకమై తిరుగుబాటు చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… ఆయన కూడా రైతుల పక్షాన నిలబడ్డారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత… కెసిఆర్ గతంలో చెప్పిన మాట చెప్పడం గమనార్హం. దీంతో రేవంత్ రెడ్డి పైన తెలంగాణ రైతులు తిరుగుబాటు చేయక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. CM Revanth Reddy: