Cockroach Janatha: దిగొచ్చిన మోడీ.. కాక్రోచ్ జనతా పార్టీ దీక్షతో కేంద్రం అప్రమత్తం!!

ఢిల్లీలో పరిస్థితులు తలకిందులవుతుండటంతో ప్రధాని మోడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం మరింత హైలెట్ అవుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది.

Cockroach alert: ఢిల్లీలో అత్యవసర సమావేశం

వారం రోజులుగా NEET పరీక్షలో అవకతవకలు, విద్యాశాఖ మంత్రి రాజీనామా, విద్యార్థుల ఆత్మహత్యలపై నిరసనలు వస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే శనివారం ఉదయం ఆమరణ దీక్షకు దిగారు. ఇంతకు ముందు సోనమ్ వాంగ్ చుక్ కూడా అదే చోట దీక్ష చేపట్టారు, కానీ పోలీసులు అరెస్ట్ చేసి హాస్పిటల్కు తరలించారు. దీంతో నిరుద్యోగులు కూడా వీరికి సపోర్ట్ గా నిలిచారు.

పంజాబ్, హరియాణా రాష్ట్రాల నుంచి యువత ఢిల్లీకి వచ్చి ఉద్యమంలో పాల్గొంటుండటంతో సిచ్యుయేషన్ మరింత హాట్ అయింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం వెంటనే ప్రధాని మోడీ నేతృత్వంలో అత్యవసర meeting ఏర్పాటు చేసింది. ఈ meetingలో ఏ నిర్ణయం తీసుకుంటారు అనే ఆసక్తి నెలకొంది.

తాజా న్యూస్ ప్రకారం, సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా ఈ మీటింగ్లో చర్చకు రావచ్చు. కాక్రోచ్ పార్టీ ఉద్యమం మరింత ముదురకముందే పరిస్థితుల్ని అదుపులోకి తీసుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు మరి ఏం జరుగుతుందో చూడాలి.

Share your love