Deepika-Anushka: దీపిక పదుకొనే అనుష్క శర్మల మధ్య కోల్డ్ వార్.. ఆ హీరో ప్రేమ కోసమేనా.?
Deepika-Anushka: దీపిక పదుకొనే అనుష్క శర్మ మధ్య నిజంగానే కోల్డ్ వార్ నడుస్తుందా.. గతంలో నడిచింది కానీ ఇంకా ఇప్పటికి వారి మధ్య ఆ పగ చల్లారలేదా..ఇంతకీ దీపిక పదుకొనే అనుష్క శర్మ మధ్య ఈ కోల్డ్ వార్ ఉండడానికి గల కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ హీరోయిన్స్ అయినటువంటి దీపిక పదుకొనే అనుష్క శర్మ మధ్య నటుడు రణ్ వీర్ సింగ్ కారణంగా అప్పట్లో గొడవలు వచ్చాయి.

Cold war between Deepika Padukone-Anushka Sharma
ఎందుకంటే మొదట్లో రణ్ వీర్ సింగ్ అనుష్క శర్మ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే దీపిక పదుకొనే ఎప్పుడైతే రణ్ వీర్ సింగ్ కి పరిచయం అయిందో అప్పటినుండి అనుష్క శర్మని దూరం పెట్టాడట.ఇక పూర్తిగా అనుష్క శర్మకు బ్రేకప్ చెప్పి దీపిక పదుకొనే ప్రేమలో రణ్ వీర్ సింగ్ మునిగిపోయాడు. (Deepika-Anushka)
Also Read: Sneha Ullal: విడాకులు తీసుకున్న సెలబ్రిటీని పెళ్లి చేసుకోబోతున్న బాలకృష్ణ హీరోయిన్.?
ఆ సమయంలో తనకి రణ్ వీర్ సింగ్ దూరం అవ్వడానికి కారణం దీపికనే అని అర్థం చేసుకున్న అనుష్క శర్మ అప్పటినుండి దీపికపై పగ పెంచుకుంది. ఇక సమయం దొరికినప్పుడల్లా దీపిక పదుకొనే పై విషం చిమ్ముతూనే ఉంటుంది. అలా తాజాగా అనుష్క శర్మ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ ఇన్ డైరెక్ట్ గా దీపిక పదుకొనేని ఉద్దేశించే ఉన్నట్టు అర్థమవుతుంది.

ప్రస్తుతం అనుష్క శర్మ కామెంట్స్ దీపిక కి ఇండైరెక్టుగా గుచ్చుకోవడంతో చాలామంది దీపిక ఫ్యాన్స్ అనుష్క పరోక్షంగా దీపికని టార్గెట్ చేసింది అని కామెంట్లు పెడుతున్నారు.ఇక బాలీవుడ్ జనాలు కూడా పెళ్లయి ఇద్దరికీ పిల్లలు పుట్టాక ఇంకా ఈ వైరాలు ఏంటి ఈ గొడవలు ఏంటి అంటూ మాట్లాడుకుంటున్నారు.(Deepika-Anushka)