Almonds: డ్రై ఫ్రూట్ తింటున్నారా… అయితే ఇవి తెలుసుకోండి ?
Almonds: డ్రై ఫ్రూట్ విషయంలో చాలామందికి వివిధ రకాల అపోహలు ఉంటాయి. ఇవి తింటే శరీరంలో విపరీతంగా కొవ్వు పెరుగుతుందని, బరువు పెరుగుతామని, లావు అవుతామని లేనిపోని ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేకించి బాదం విషయంలో ఈ అపోహలు సరిహదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల బరువు పెరగకుండానే శరీరానికి ఉపయోగపడే ఇతర అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే వీటిని తినే విషయంలో కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదట.
Common Mistakes To Avoid When Eating Almonds
నిజానికి బాదం చర్మం, ఫిట్నెస్ ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగిస్తుంది. బాదంలో క్యాలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఇందులో విటమిన్-ఈ, పీచు వంటి ఎన్నో పోషకాలు అధికంగా ఉంటాయి. బాదంను ఆరోగ్యానికి మేలు చేయాలంటే వాటిని తినే సమయంలో కొన్ని రకాల తప్పులను చేయకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పును ఎప్పుడు నానబెట్టి మాత్రమే తీసుకోవాలి. తినడానికి ముందు పొట్టు తీసేస్తే మరి మంచిది. చాలామంది తొక్కతో పాటు నానబెట్టకుండానే తింటూ ఉంటారు. దానివల్ల పూర్తి ప్రయోజనాలు కలగవు.
చాలా మంది బాదంపప్పును నూనె లేదా నెయ్యిలో వేయించి మసాలా దినుసులు వేసి తింటూ ఉంటారు. ఇలా చేస్తే మరింత క్రిస్పీగా రుచిగా మారుతుంది. కానీ ఈ పొరపాటు అసలు చేయకూడదు. ఇలా తింటే శరీరంలో కొవ్వు చేరి విపరీతంగా బరువు పెరుగుతారు. చాలామంది తమ రోజు వారి దినచర్యలో బాదంపప్పును తినరు. అప్పుడప్పుడు మాత్రమే తింటూ ఉంటారు. కానీ సరైన ప్రయోజనాలను పొందడానికి బాదాన్ని రోజు పరిమిత పరిమాణంలో తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పు నిలువ చేసేటప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఒకటి ఉంటుంది. బాదం పప్పులను చాలా వేడిగా లేదా చాలా తేమగా ఉండే ప్రదేశంలో ఉంచుతారు. దీని కారణంగా బాదం సహజ పోషకాలను కోల్పోతుంది. అలర్జీ వంటి కొన్ని వ్యాధులు ఉన్నవారు బాదం తినకపోవడమే మంచిది.