KCR: కాంగ్రెస్ పరువు పాయె.. KCR కే 70% ఓట్లు ?
KCR: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని… బహిరంగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు.. నిలదీస్తున్నారు. న్యూస్ ఛానల్ లేదా యూట్యూబ్ ఛానల్ విలేకరులు వెళ్లి మైకు ముందు పెడితే బండ బూతులు తిడుతున్నారు తెలంగాణ ప్రజలు.
congress party survey on KCR and revanth
అయితే ఇలాంటి… తెలంగాణ రాష్ట్రంలో గత కెసిఆర్ పాలన బాగుందా? లేదా రేవంత్ రెడ్డి ఏడాది పాలన బాగుందా? అనే పోస్టు ను కాంగ్రెస్ తన సోషల్ మీడియాలో పెట్టింది. అయితే ఈ పోస్టు పైన దాదాపు లక్ష మంది ఓటర్లు పాల్గొన్నారు. ట్విట్టర్లో పెట్టిన ఈ పోస్టులో కెసిఆర్ మాత్రమే గెలిచారు.
అది కూడా కెసిఆర్ పాలనకు 70% మంది ఓట్లు వేయడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీకి కేవలం 30 శాతం మంది ఓట్లు వేశారు. తమకు ఫామ్ హౌస్ పాలనే కావాలంటూ… సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు. దీంతో ఈ పోస్ట్ పై కాంగ్రెస్కు ఎదురు దెబ్బ తగిలింది.