Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టుపై కుట్ర.. జైల్లోనే మూడు రోజులు..?
Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ పై అభిమానులందరూ షాక్ లో మునిగిపోయిన వేళ ఆయన అరెస్టు కుట్రపూరితమని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా హీరోల సినిమాలు విడుదలైన సమయంలో అభిమానులు చనిపోయారు. మరి ఆ టైంలో ఎందుకు ఆ హీరోలను అరెస్ట్ చేయలేదు.. మా హీరోనే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అల్లు అర్జున్ అభిమానులు పోలీసులపై ఫైర్ అవుతున్నారు.అయితే ఈ గొడవ వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని కొంతమంది అంటే తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు.
Conspiracy on Allu Arjun Arrest Three days in jail
అల్లు అర్జున్ అరెస్టుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందులో నేను చేయవలసింది ఏమీ లేదు ఇందులో నా జోక్యం ఏమి ఉండదు అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే అల్లు అర్జున్ అరెస్టు అయిన నేపథ్యంలో గాంధీ హాస్పిటల్ కి తీసుకువెళ్లి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టుకు ఆయన్ని హాజరు పరుస్తున్నారు. (Allu Arjun Arrest )
Also Read: Allu Arjun: టైమ్ చూసి వీకెండ్ లోనే అల్లు అర్జున్ అరెస్ట్.. ఎవరి స్కెచ్ ఇది?
ఇక గాంధీహాస్పిటల్ నుండి అల్లు అర్జున్ బయటకు వస్తున్న సమయంలో ఎంతో మంది అభిమానులు ఆయన్ని చూడడానికి వచ్చారు. అలాగే హాస్పిటల్ కి అల్లు అరవింద్ బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు.ఇక నాగబాబు, చిరంజీవి, సురేఖ ముగ్గురు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి వారిని ఓదార్చారు.అలాగే అల్లుఅర్జున్ ని చూడడానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వస్తాడని తెలిసి చిక్కడపల్లి పోలీసులు చిరంజీవిని అక్కడికి రావద్దని చెప్పారట.ఎందుకంటే చిరంజీవి వస్తే అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
వారిని మేము కంట్రోల్ చేయలేము అని చెప్పారట. ఇక అల్లు అర్జున్ మూడు రోజుల వరకు జైల్లోనే ఉండబోతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే కోర్టులోకి అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా ప్రభుత్వం తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి మాత్రం ఈ కేసు విషయంలో సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని డిమాండ్ చేశారు. అంటే రేపు ఎల్లుండి సెలవులు కావడంతో సోమవారం వరకు అల్లు అర్జున్ ని జైల్లోనే ఉంచుతారని తెలుస్తోంది.(Allu Arjun Arrest )