Cooler Tips: ఏసి లాగే కూలర్ కూడా చల్లటి గాలి ఇస్తుంది. ఏసీలా మనం వేసవికాలంలో చల్లదనానికి వాడుతాము. కూలర్ ని కూడా అలా ఈజీగా వాడుకోవచ్చు. ఏసీ తో పోల్చుకుంటే కూలర్ ధర కూడా తక్కువ ఉంటుంది. ఏసీ లాగే కూలర్లలో కూడా పేలుడు జరుగుతాయా..? ఏసీలు అంటే అందులో గ్యాస్ తో కూడుకున్న కంప్రెసర్ ఉంటుంది. కూలర్లలో అలాంటివి ఉండవు. మరి కూలర్ కూడా పేలుతుందా..? కూలర్ పేలిపోయే అవకాశాలు ఉండవా అనే దాని గురించి చూద్దాం. ఇవి కూడా ప్రమాదమైనవి అని నిపుణులు అంటున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
Cooler Tips to not get blast
కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటి కోసం ఇప్పుడు చూద్దాం.. ఇలా కనుక మీరు ఫాలో అయ్యారంటే పేలుడు సంభవించదు అని గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఇక్కడ చెప్పిన చిట్కాలను అనుసరించడం మర్చిపోవద్దు. పైగా ఆ పేలిపోకుండా ఉంటే మరమ్మత్తు ఖర్చులు కూడా ఉండవు. మీరు కూడా ఏర్ కూలర్ ని ఉపయోగిస్తున్నట్లయితే మీరు ఇక్కడ పేర్కొన్న చిట్కాలని ఫాలో అవ్వడం మంచిది. ఏసీల లాగా కూలర్ పేలుతుందని భయాందోళన చెందుతూ ఉంటారు. చాలామంది ఏసీల వల్ల జరిగే ప్రమాదం కంటే కూలర్లలో తక్కువ ఉంటుంది. కానీ మీరు మీ కూలర్ ను క్రమానుగతంగా శుభ్రం చేయకపోతే కూలర్ త్వరగా చెడిపోతుంది. దీని వలన కూలర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించవచ్చు.
Also read: Tasty Teja: డ్రైవింగ్ చేస్తూ అవేం పనులు భయ్యా.. టేస్టీ తేజ పై ఫైర్ అవుతున్న నెటిజన్స్..!
అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకొని పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నట్లు పేలుడు అంటే ఏదో బాంబు పేలినట్లు కాదు. మీ కూలర్ సజావుగా నడవాలంటే క్రమానుగతంగా కూలర్ ని క్లీన్ చేయాలి. ఇది కాకుండా కూలర్ నిర్వహణ కూడా చేయాలి. కూలర్ కిట్ క్రమానుగతంగా సర్వీస్ చేయించాలి. దీన్ని మీరు సర్వీస్ చేయించుకుంటూ ఉంటే షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉండదు. ప్రతి సీజన్ ప్రారంభంలో కూలర్లను కూడా చెక్ చేయండి. ఏదైనా పని చేయకపోవడం లేదంటే అసాధారణ ధ్వని ఉంటే వెంటనే టెక్నీషియన్ ను పిలిపించి సరి చేయించుకోవాలి. ఏ జాగ్రత్తలను కనుక ఫాలో అయ్యారంటే కూలర్ ప్రమాదం తగ్గుతుంది (Cooler Tips).