Credit card : క్రెడిట్ కార్డుల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య క్రెడిట్ కార్డులను ఎక్కువగా వాడుతున్నారు. క్రెడిట్ కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇందులో ముఖ్యమైనది క్రెడిట్ నెంబర్ తో పాటుగా సివివి ఎక్స్పైర్ డేట్. కార్డు పై ఉండే నెంబర్లను గమనిస్తే 16 ఉంటాయి. ఏ బ్యాంకు కి చెందిన క్రెడిట్ కార్డు గమనించిన కూడా 16 ఆమెకెలు ఉంటాయి ఇంతకీ క్రెడిట్ కార్డులు పై కేవలం 16 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటాయి దాని వెనుక కారణం ఏంటి వంటి విషయాలని ఇప్పుడు చూద్దాం.

Credit card 16 digits details

కార్డుపై ఉండే నెంబర్ను కనుక గమనిస్తే 16 ఉంటాయి ఏ బ్యాంకుకు చెందిన కార్డు అయినా కూడా 16 అంకెలే ఉంటాయి. క్రెడిట్ కార్డు పై కేవలం 16 నెంబర్లు మాత్రమే ఎందుకు ఉంటాయి దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూసేద్దాం… క్రెడిట్ కార్డులోని మొదటి నెంబర్ సదరు కార్డును జారీ చేసిన సంస్థ ఏంటో చెబుతుంది, తొలి సంఖ్య 4 అయితే ఆ కార్డును వీసా జారీ చేస్తుందని చెప్పొచ్చు, అదే ఐదు అయితే మాస్టర్ కార్డు సదరు క్రెడిట్ కార్డు ను జారీ చేసిందని అర్థం. ఆరు అయితే రూపే జారీ చేసిందని.

Also read: Revanth Reddy: నీట్ విషయంలో విచారణ జరపాలి..!

క్రెడిట్ కార్డ్ లోని తర్వాత 6 నెంబర్లు సదరు కార్డును ఏ బ్యాంకు జారీ చేసిందో చెప్తాయి దీన్ని బ్యాంక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని పిలుస్తారు. ఏడు నుండి 15 సంఖ్యలు క్రెడిట్ కార్డుకు సంబంధించిన అకౌంట్ ఏంటో తెలుపుతుంది. ఈ అకౌంట్ మీకు క్రెడిట్ కార్డును జారీ చేసిన బ్యాంకుల వద్ద ఉంటాయి. క్రెడిట్ కార్డు లోని చివర సంఖ్య పిలుస్తారు ఈ కార్డు నకిలీకి క్రెడిట్ కార్డులు తయారీకి అడ్డుకట్ట వేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా క్రెడిట్ కార్డు 16 అంకెలు వెనక ఇంత పెద్ద కారణం ఉంటుంది (Credit card).