CSK Fans : జడేజా గ్రాండ్ ఎంట్రీ.. పుష్ప గాడి వీడియో తో చెన్నై జట్టు లోకి!!

CSK Fans : రవీంద్ర జడేజా ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో చేరారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించిన అనంతరం జడేజా పుష్ప మూవీ స్టైల్‌లో “జడ్డూ అంటే పేరు కాదు బ్రాండ్” అనే డైలాగ్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. చెన్నై జట్టు ట్వీట్ చేసిన ఈ వీడియోను ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.
CSK Fans Celebrate Jadeja’s Return
ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే IPL 2025 కోసం చెన్నై జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించింది. కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా జట్టులో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. CSK తన తొలి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్తో హోమ్ గ్రౌండ్‌లో ఆడనుంది. అనంతరం చెపాక్ స్టేడియంలో ఆర్సీబీతో మ్యాచ్ జరగనుంది.
జడేజా ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 5 మ్యాచ్‌ల్లో 4.35 ఎకానమీ రేట్తో 5 కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో విజయం తథ్యం చేసే షాట్ కొట్టి భారత జట్టును గెలిపించాడు.
ఐపీఎల్ 2025లో CSK తమ 6వ టైటిల్ గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. CSK జట్టులో రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రవిచంద్రన్ అశ్విన్, షేక్ రషీద్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. జట్టులో యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులు కూడా ఉండటంతో CSK ఫ్యాన్స్ విజయాన్ని ఆశిస్తున్నారు.