Curry Leaves: పొద్దున్నే నాలుగు కరివేపాకు రెమ్మలను తింటే 100 రోగాలకు చెక్ ?
Curry Leaves: తాలింపులో రెండు కరివేపాకు రెమ్మలని వేసుకున్నామంటే వంటకం గుమగుమలాడిపోతుంది. కానీ తినేటప్పుడు మాత్రం ఆకుల్ని తీసి పక్కన పెట్టేస్తుంటాం. కానీ అది చేసే మేలు ఏంటో తెలుసుకున్నారు అంటే కరివేపాకు అని పక్కన పెట్టేయకుండా కాస్త ఆలోచనలో పడతారు. ఆడవాళ్ళ దృష్టిలో కరివేపాకు వంటల్లో వేసే పదార్థమే కాదు అదొక ఎమోషన్ లాంటిది. వంటకు సిద్ధంగా అన్ని పదార్థాలు ఉన్న తాలింపులోకి కరివేపాకు లేదంటే మాత్రం ఎంతో వెలితిగా భావిస్తారు.
Curry Leaf Benefits and Uses
అందుకే అప్పట్లో సువాసన వెదజల్లే కరివేపాకును పెంచుకుంటే ఇప్పుడు వీలును బట్టి బాల్కనీ కుండీల్లోనూ పెంచుతున్నారు. కరివేపాకు వాసనతో పాటు వంటకం, రుచిని పెంచుతుంది. ఇందులో విటమిన్ ఏ, సి, బి, కాంప్లెక్స్, విటమిన్లు అనేక ఖనిజాలు మొక్కల ఆధారిత యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కరివేపాకును ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తిన్నట్లయితే ఆరోగ్యంలో అనేక రకాల మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మ సమస్యలకు ఎంతో చక్కగా పనిచేస్తుంది.
ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు ఆకులను తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గిపోయి చర్మం సహజంగా, కాంతివంతంగా మెరుస్తుంది. రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏడు నుంచి పది కరివేపాకులను తింటే నెల రోజుల్లోనే బరువు కూడా తగ్గుతారు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకును నమలడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. జుట్టు ఒత్తుగా, పెరిగేలా సహాయం చేస్తుంది. ప్రతిరోజు ఉదయం సిక్ నెస్ సమస్యతో బాధపడేవారికి కరివేపాకు చాలా మంచిది. ఇది జీర్ణక్రియకు, రక్తంలో చక్కెర నియంత్రణకు, ఆరోగ్యకరమైన గుండెకు సహాయంగా ఉంటుంది.