Daaku Maharaaj Hindi: దారుణమైన స్థితిలో బాలకృష్ణ ‘డాకు మహారాజ్’.. భారీ డిజాస్టర్!!
Daaku Maharaaj Hindi: డాకు మహారాజ్ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వచ్చినప్పటికీ, Box Office వద్ద మెరుగైన కలెక్షన్లను సాధించడంలో మాత్రం చిత్రం విఫలమైంది. సంక్రాంతి సీజన్ సమయంలో విడుదలైన ఈ సినిమా మొదట్లో పరవాలేదనిపించుకున్నా తర్వాత వసూళ్లు తగ్గాయి. ముఖ్యంగా డే 1 కలెక్షన్లు బాగున్నప్పటికీ, మిగతా రోజుల కలెక్షన్లు అంతగా ఆకట్టుకోవడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమా 160 కోట్ల గ్రాస్ మార్క్ పరిధిలోనే నిలిచిపోయింది.
Daaku Maharaaj Hindi collection update
తెలుగులో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, తమిళంలో మరియు హిందీలో కూడా విడుదల అయింది. అయితే అక్కడ కూడా పెద్దగా వసూళ్లు రాలేదనే చెప్పాలి. ఈ చిత్రానికి తమిళ ప్రేక్షకుల నుండి కూడా పెద్దగా స్పందన లేదనే చెప్పాలి. హిందీలో కూడా ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.
సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమా తో పాటు ఇతర పెద్ద సినిమాలు విడుదల అవడం అవి మంచి టాక్ తో కలెక్షన్లు సాధించడంతో డాకు మహారాజ్‌ను ప్రేక్షకులు పక్కన పెడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా తో పాటు విడుదలైన ఇతర సినిమాలు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. దాంతో ఈ సినిమా కు ప్రేక్షకులు పెద్దగా ఇంటరెస్ట్ చూపించడం లేద. అందుకే ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్లు రాలేదు.
ఈ సినిమా బాగానే ఉందన్న టాక్ వచ్చినా కూడా ప్రేక్షకుల నుండి ఆశించిన బాక్స్ ఆఫీస్ స్పందనను అందుకోలేదు, కానీ ప్రస్తుతం ఉన్న కలెక్షన్లు చూస్తుంటే బాలయ్య కెరీర్ లో చాలా రోజుల తర్వాత ఫ్లాప్ వచ్చినట్లే అని చెప్పాలి. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.