Daggubati Abhiram: గుడ్ న్యూస్.. రానా కంటే ముందే తండ్రైన దగ్గుబాటి అభిరామ్..?
Daggubati Abhiram: దగ్గుబాటి అభిరామ్.. సినిమాల్లోకి రాకముందే కాంట్రవర్సీ కింగ్ గా మారిపోయిన దగ్గుబాటి అభిరామ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది నటీ నటులు సినిమాల్లోకి వచ్చాక కాంట్రవర్సీలో ఇరుక్కుంటారు. కానీ ఈయన సినిమాల్లోకి రాకముందే పెద్ద కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. అది కూడా ఒక నటి అవకాశాల పేరుతోనే వాడుకొని వదిలేసాడు అంటూ రచ్చ రచ్చ చేసింది.
Daggubati Abhiram couple though parents
ఇక ఆమె ఎవరో మీ అందరికీ ఇప్పటికే తెలిసే ఉంటుంది.. దగ్గుబాటి అభిరామ్ తనని వాడుకొని వదిలేసాడు అంటూ శ్రీరెడ్డి అప్పట్లో ఫిలింనగర్ ఎంత రచ్చ చేసిందో చెప్పనక్కర్లేదు.ఇప్పటికి కూడా శ్రీరెడ్డి పేరు ఎత్తితే దగ్గుబాటి ఫ్యామిలీకి మొత్తం వణుకు పుడుతుంది కావచ్చు.అంతలా దగ్గుబాటి ఫ్యామిలీ పరువు మొత్తం తీసేసింది శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి దగ్గుబాటి అభిరామ్ కలిసి దిగిన ప్రైవేట్ ఫోటోలు కూడా బయటపడ్డాయి.(Daggubati Abhiram_
Also Read: Jani Master: అసిస్టెంట్ ని టార్చర్ చేసింది నిజమే.. జానీ మాస్టర్ మళ్లీ జైలుకే..?
ఇదంతా పక్కన పెడితే గత ఏడాది బంధువుల అమ్మాయి ప్రత్యూషని వివాహం చేసుకున్న దగ్గుబాటి అభిరామ్ పెళ్లిని ఇండియాలో కాకుండా శ్రీలంకలో చేసుకున్నారు. ఇక పెళ్లయ్యాక దగ్గుబాటి ఫ్యామిలీ హైదరాబాదులో గ్రాండ్గా రిసెప్షన్ పార్టీని కూడా అరేంజ్ చేసింది.అయితే గత ఏడాది పెళ్ళైన ఈ జంట సంవత్సరానికే తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు.
తాజాగా దగ్గుబాటి అభిరామ్ కి పండంటి ఆడబిడ్డ జన్మించింది.. దాంతో దగ్గుబాటి ఫ్యామిలీలో ఆనందాలు వెళ్లి విరిసాయి. అయితే అభిరామ్ కంటే ముందే రానాకి పెళ్లి జరిగినప్పటికీ ఇప్పటివరకు రానా గుడ్ న్యూస్ చెప్పడం లేదు. అయితే వీళ్ళు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు అనుకున్నారో ఏమో తెలియదు.(Daggubati Abhiram)