Daku Maharaj: డాకూ మహారాజ్ ట్విట్టర్ రివ్యూ.. నట విశ్వరూపం చూపించిన బాలయ్య.?
Daku Maharaj: డాకూ మహారాజ్..బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన తాజా మూవీ డాకు మహారాజ్. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదలైంది.అయితే ఈ సినిమా జనవరి 12న విడుదలనుండగా ఒక రోజు ముందే అర్ధరాత్రి జనవరి 11న ప్రీమియర్ షోలు,బెనిఫిట్ షోలు పడిపోయాయి. ప్రీమియర్ షోలు చూసిన చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇచ్చేస్తున్నారు. మరి డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది.. పబ్లిక్ ఏం చెబుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.
Daku Maharaj Twitter review
బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేల నటించిన ఈ మూవీ భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బాలయ్య నట విశ్వరూపం చూపించాడు అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు ఎక్స్ ద్వారా ట్వీట్స్ చేస్తున్నారు. అయితే కొన్ని సన్నివేశాలు చాలా బోరింగ్ గా ఉన్నాయని సినిమా నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించేలా ఉన్నాయని కానీ బాలకృష్ణ నటన మాత్రం సినిమాకి పెద్ద ప్లస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Daku Maharaj)
Also Read: Daku Maharaj: డాకు మహారాజ్ పై నాగవంశీ కి ఎక్కువ అంచనాలున్నట్లుంది!!
సినిమా టెక్నికల్ గా బాగున్నప్పటికీ కథ అంతగా లేదని రొటీన్ స్టోరీ అని క్లైమాక్స్ ఆసక్తికరంగా లేదని క్లైమాక్స్ ని అందరూ ఊహించగలరు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ చాలా బాగుందని కానీ సెకండ్ హాఫ్ ప్రారంభం నుండే సినిమా బోరింగ్ గా అనిపించిందని, మొత్తానికి బాలకృష్ణ అభిమానులకు ఇది ఒక పైసా వసూల్ మూవీ అంటూ రివ్యూ ఇస్తున్నారు. అయితే ఒక క్లైమాక్స్ తప్ప మిగిలిన సినిమా అంతా ఓకే అంటూ ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.
అలాగే బాలకృష్ణ అంటే గుర్తుకు వచ్చే యాక్షన్స్ సన్నివేషాలు గూస్ బంప్స్ తెప్పించే డైలాగులు అదిరిపోయాయని, తమన్ ఈ సినిమాకి వేరే లెవెల్ లో మ్యూజిక్ అందించారని,డైరెక్టర్ బాబీ కొల్లి స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా బాగుంది అని మెచ్చుకుంటున్నారు. మరి చూడాలి ప్రీమియర్ షోస్ చూసిన జనాలు క్లైమాక్స్ బాగాలేదు అని మిక్స్డ్ రివ్యూ ఇస్తున్నారు మరి సినిమాకి ముందు ముందు రివ్యూస్ ఎలా ఉంటాయో చూడాలి.(Daku Maharaj)