David Warner: RCB లోకి డేవిడ్ వార్నర్.. ఇక ఫ్యాన్స్ కు రచ్చ రచ్చే..?

David Warner: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటుకు సంబంధించిన మెగా వేలంలో డేవిడ్ వార్నర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఈ మెగా వేలంలో డేవిడ్ వార్నర్ అన్ సోల్డ్ ప్లేయర్గా మిగిలిపోయాడు. గతంలో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్… 2024 సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. David Warner

David Warner into RCB Over Ipl 2025

రిషబ్ పంత్ కు యాక్సిడెంట్ కావడంతో 2023 సీజన్లో కెప్టెన్ గా కూడా ఢిల్లీకి పని చేశాడు వార్నర్. అయితే హైదరాబాద్ను వీడిన తర్వాత డేవిడ్ వార్నర్ పర్ఫామెన్స్ పెద్దగా కనిపించలేదు. టి20 మ్యాచ్లను టెస్ట్ మ్యాచ్ ల తరహాలో ఆడాడు డేవిడ్ వార్నర్. దీంతో డేవిడ్ వార్నర్ పై కోట్ల వర్షం కురిపించేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అయితే డేవిడ్ వార్నర్ ను ఎవరు కొనుగోలు చేయకపోవడంతో… ఇప్పుడు అతనికి ఆర్సిబి అవకాశం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. David Warner

Also Read: Roja: రోజా సంచలన కామెంట్స్…జైల్లో పెడతావా పెట్టుకో..?

వచ్చే సీజన్ లో డేవిడ్ వార్నర్ ను ఆడించబోతుందట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఆస్ట్రేలియా ప్లేయర్ జోష్ హాజెల్ వుడ్ కు ఇటీవల గాయమైంది. అయితే అతను ఐపిఎల్ టోర్నమెంట్ కు కూడా దూరమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయట. జోష్ హాజెల్ వుడ్ ఆడక పోవడం గ్యారంటీ అంటున్నారు. దీంతో అతని స్థానంలో డేవిడ్ వార్నర్ను జట్టులోకి తీసుకోవాలని అనుకుంటున్నారట. డేవిడ్ వారు జట్టులోకి వస్తే బ్యాటింగ్ పరంగా ఆర్సిబి బలంగా తయారవుతోందని.. అనుకుంటున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. David Warner

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *