Devara 2 Movie: ఎన్టీఆర్ ‘దేవర 2’ అప్‌డేట్.. షూటింగ్ డేట్ లీక్.. డీటెయిల్స్ ఇవే!!


Devara 2 Movie Latest Update & News

Devara 2 Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన “దేవర” బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా, ఫ్యాన్స్ మరియు ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు, మేకర్స్ సీక్వెల్‌పై దృష్టి పెట్టారు. “దేవర -2” స్క్రిప్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి, మేకర్స్ ఈ సినిమాను మరింత గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Devara 2 Movie Latest Update & News

దర్శకుడు కొరటాల శివ, తన టీమ్‌తో కలిసి స్క్రీన్‌ప్లే మరియు కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలచేందుకు కసరత్తు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, “దేవర 2” షూటింగ్ ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయిప్పటికీ, ఈ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించనుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. అదనంగా, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ వంటి ప్రముఖ నటులు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు.

ఇదిలా ఉంటే, “వార్ 2” షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సన్నద్ధమవుతున్నాడు. “దేవర 2” అధికారిక అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *