Pushpa 2: గత కొన్ని రోజుల నుండి పుష్ప 2 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దేవిశ్రీప్రసాద్ కి, డైరెక్టర్ సుకుమార్,హీరో అల్లు అర్జున్,పుష్ప నిర్మాతలకు గొడవలు జరుగుతున్నాయని, దేవిశ్రీ ని వీరందరూ పక్కకు నెట్టేసారని, దేవిశ్రీప్రసాద్ నీ పక్కన పెట్టి తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారని ఎన్నో రూమర్రు వినిపించాయి. అయితే ఈ రూమర్లన్నింటికీ తెరపడేలా చెన్నైలో జరిగిన పుష్ప-2 కు సంబంధించిన వైల్డ్ ఫైర్ ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ వచ్చి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు.
Devi Sri Prasad is a shock to the producers of Pushpa 2
అయితే వైల్డ్ ఫైర్ ఈవెంట్ కి రావడం అయితే వచ్చాడు.కానీ ఆ ఈవెంట్లో దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడిన మాటలు నిర్మాతలకు పరోక్షంగా చురకలు అంటించినట్లు ఉన్నాయి. మరి ఇంతకీ దేవిశ్రీప్రసాద్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. దేవిశ్రీప్రసాద్ స్టేజ్ మీద మాట్లాడే మాటలపై అందరికీ ఒక ఉత్కంఠ అయితే ఉంది. ఆయన ఏం మాట్లాడుతారని. అయితే ఆయన నోరు తెరవడంతోనే ప్రతి ఒక్కరు ఈలలు వేస్తూ గట్టిగా అరిచారు. ఇక దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. ఏదైనా సరే అడిగి తీసుకోవాల్సిందే… (Pushpa 2)
Also Read: Venkatesh: బావ బామ్మర్దులు అవ్వాల్సిన వెంకటేష్ రాజశేఖర్.. కానీ ఎక్కడ చెడిందంటే.?
అది ప్రొడ్యూసర్లు ఇచ్చే పేమెంట్ లు అయినా..స్క్రీన్ మీద మనకు వచ్చే క్రెడిట్ అయినా సరే అడిగి తీసుకోవాల్సిందే. అడగకుండా ఏదీ రాదు ఎవరు ఇవ్వరు..అంటూ దేవిశ్రీప్రసాద్ మాట్లాడారు. అయితే ఈయన మాటలు పరోక్షంగా పుష్పటు నిర్మాతలు బిజిఎం కావాలి అని తనని టైంకి అడగలేదు అనే అర్థం వచ్చేలా ఉన్నాయి. అలా తనని ముందుగా అడగకపోవడం వల్లే బిజిఎం ఇవ్వలేక దేవిశ్రీప్రసాద్ పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది.అయితే దేవిశ్రీప్రసాద్ ని నిర్మాతలు ముందుగా బిజిఎం కావాలి అని అడగకపోవడం వల్లే దేవి శ్రీ ప్రసాద్ పక్కకు తప్పుకున్నారా..
లేక కావాలనే నిర్మాతలు ఆయనని పక్కనపెట్టి తమన్ ని తీసుకున్నారా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు నిర్మాత రవి గురించి మాట్లాడుతూ.. మీకు నా మీద ప్రేమతో పాటు కంప్లైంట్స్ కూడా ఎక్కువే. మీరు చెప్పినవి సమయానికి ఇవ్వలేదని ఫీలవుతారు అని పరోక్షంగా ఆలస్యం అవ్వడానికి గల కారణాన్ని కూడా దేవిశ్రీప్రసాద్ చెప్పుకోచ్చారు.ఇలా దేవిశ్రీప్రసాద్ తనదైన మాటలతో పుష్పటు నిర్మాతలకు పరోక్షంగా సెటైర్లు వేస్తూ చాలా స్మూత్ గా ఎవరిని నొప్పించకుండా మాట్లాడారు. ప్రస్తుతం ఈయన మాట్లాడిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.(Pushpa 2)