Dhanush: అజిత్ కోసం ధనుష్ త్యాగం చేశాడా? పోస్ట్ పోన్ అయిన భారీ రిలీజ్ ప్లాన్!!

Dhanush: సినిమా రంగంలో ఒక సినిమా విడుదల కోసం మరొక సినిమా వాయిదా పడడం చాలా సహజం. మహేష్ బాబు తన శ్రీమంతుడు సినిమాను బాహుబలి కోసం వాయిదా వేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అజిత్-ధనుష్ సినిమాల విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఇందులో అసలు ట్విస్ట్ వేరే ఉంది.
Dhanush postpones Idli Kadai for Ajith
ధనుష్ నటించి, దర్శకత్వం వహించిన ‘ఇడ్లీ కడాయి’ ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉంది. కానీ అదే రోజున అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా విడుదల అవుతుందని ప్రకటించడంతో బయ్యర్లు ఆందోళన చెందారు. ఈ పోటీ కారణంగా ధనుష్ సినిమాను వాయిదా వేశారని ప్రచారం జరుగుతోంది. అజిత్ కోసం ధనుష్ త్యాగం చేశాడనే వార్తలు మాత్రం నిజం కావు.
వాస్తవానికి ‘ఇడ్లీ కడాయి’ షూటింగ్ ఇంకా మిగిలి ఉంది. కొన్ని టాకీ పార్ట్, విదేశాల్లో చిత్రీకరించాల్సిన పాటలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాదు, ఇటీవల ధనుష్ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమా కోసం కొంత విరామం తీసుకున్నాడు. అలాగే, అతడు బాలీవుడ్ సినిమా ‘తేరి మేరీ ఇష్క్’ షూటింగ్‌లో పాల్గొనడంతో సినిమా ఆలస్యమైంది.
అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అజిత్ సినిమాకు బాక్సాఫీస్‌లో పోటీ ఇవ్వడం కష్టమని భావించి, ధనుష్ తన సినిమాను వాయిదా వేశాడని చెన్నై వర్గాలు అంటున్నాయి. ‘ఇడ్లీ కడాయి’ జూలై లేదా ఆగస్టులో విడుదల అయ్యే అవకాశం ఉంది. కానీ ధనుష్ అజిత్ కోసం త్యాగం చేశాడనే ప్రచారంలో నిజం లేదు.