Dhanush takes legal action: నయన్ కు పదికోట్ల జరిమానా.. చిన్న తప్పవుకు కోర్టుకు ధనుష్!!
Dhanush takes legal action: నయనతార నటించిన ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీకి సంబంధించి ధనుష్, నయనతారల మధ్య వివాదం మరింత తీవ్రమైంది. డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమా విజువల్స్ అనుమతి లేకుండా వాడటంపై ధనుష్ నయనతారపై కోర్టులో కేసు వేశారు. ఈ వివాదం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Dhanush takes legal action against Nayanthara
‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమా షూటింగ్ సమయంలోనే నయనతార మరియు విఘ్నేష్ శివన్ మధ్య ప్రేమ చిగురించింది. ఈ సినిమా వారి జీవితంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది, అందుకే డాక్యుమెంటరీలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విజువల్స్‌ని చేర్చుకోవాలని నయనతార నిర్ణయించుకున్నారు. అయితే, ధనుష్ ఈ విషయానికి అంగీకరించకపోవడంతో, అతను కోర్టును ఆశ్రయించారు. నయనతార ఈ నిర్ణయంపై స్పందిస్తూ ఓ ఓపెన్ లెటర్ రాసి ధనుష్‌ను విమర్శించారు.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ “పుష్ప 2” కి అన్ని కలిసొస్తున్నాయా?
డాక్యుమెంటరీ ట్రైలర్‌లో ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమాకు సంబంధించిన కేవలం 3 సెకన్ల వీడియోను ఉపయోగించినందుకు ధనుష్ నయనతారకు 10 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. అయితే, పరిశీలన చేయగా, డాక్యుమెంటరీలో మొత్తం 30 సెకన్లకు పైగా ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమాకు సంబంధించిన విజువల్స్ ఉపయోగించబడినట్లు తెలుస్తోంది. దీంతో, ధనుష్ కోర్టులో కేసు వేశారు.
ఈ జంట ఇప్పుడు కోర్టు మెట్లక్కడం అభిమానులను నిరాశపరుస్తుంది. ఈ వివాదం సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్నది చూడాలి. ఈ వివాదం వారి వ్యక్తిగత సంబంధం పై ప్రభావం చూపించినా, వారి సినిమాలపై అవి ఎలా ప్రభావితం అవుతాయో అనేది ఆసక్తికరంగా మారింది.