Chandramukhi: చంద్రముఖి సినిమాని ఆ తెలుగు హీరో కావాలనే రిజెక్ట్ చేశాడా.?
Chandramukhi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆత్మలు, దయ్యాలు అనే బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో ప్రేక్షకుల ఆదరణ పొందినటువంటి చిత్రం చంద్రముఖి.. సినిమా పేరు చెప్పగానే చాలామందికి లక లక లక లక అనే డైలాగ్ టక్కున గుర్తుకొస్తుంది.. ఈ విధంగా చంద్రముఖి చిత్రంలో రజనీకాంత్ అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..

Did Chandramukhi reject the movie to become a Telugu hero
అలాంటి చంద్రముఖి మూవీ ముందుగా ఒక తెలుగు హీరోకు వచ్చిందట.కానీ ఆయన మిస్ చేసుకున్నట్టు తెలుస్తోంది.ఆ హీరో ఎవరు వివరాలు చూద్దామా.. అయితే చంద్రముఖి చిత్రం రిమేక్ అని మన తెలుగు వారికి చాలామందికి తెలియదు.. అయితే దీన్ని బాలీవుడ్ ఇండస్ట్రీ సూపర్ హిట్ మూవీ “మనిచిత్రతాయ” రీమేక్ గా వచ్చింది.. (Chandramukhi )
Also Read: Anil Ravipudi: అనిల్ రావిపూడి విన్నింగ్ స్ట్రాటజీ ఇదే.. ఇలా కూడా సెంటిమెంట్ ఉంటుందా?
ముందుగా ఈ సినిమాను చిరంజీవి హీరోగా పెట్టి చేయాలనుకున్నారట డైరెక్టర్ వి.ఎన్ ఆదిత్య.. కానీ అప్పట్లో చిరంజీవి చాలా బిజీ షెడ్యూల్ ఉండడంతో ఆయన డేట్స్ కుదరలేదట. ఈ సినిమాని చిరంజీవి తరచూ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారట.. ఇంతలో “మనిచిత్రతాయా” సినిమాను రజనీకాంత్ చూసి చాలా బాగుంది తమిళ్, తెలుగు భాషల్లో దీని రీమేక్ చేస్తే సూపర్ హిట్ అవుతుందని చెప్పారట..

వెంటనే డైరెక్టర్ పి.వాసును ఫైనల్ చేసుకొని ప్రభు, జ్యోతిక, వడివేలు, నయనతార, వంటి నటులను ఇందులో తీసుకున్నారు.. ముఖ్యంగా చంద్రముఖిగా జ్యోతిక పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.. ఈ చిత్రం అప్పట్లో థియేటర్ లో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా బంపర్ హిట్ అయిందని చెప్పవచ్చు.. అయితే ఈ మూవీ బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి చూసి చాలా ఫీలయ్యారట.. నేను ఈ సినిమా చేసి ఉంటే బాగుండేది అని అనుకున్నారట.(Chandramukhi )