Chiranjeevi: బాలయ్య బాబు కోసం చిరంజీవి అంత పెద్ద త్యాగం చేశారా.. ఎవరికి తెలియని సీక్రెట్.?
Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇంచుమించు ఒకే తరానికి చెందిన హీరోలు.. వీరి మధ్య ఇప్పటికి చాలా మంచి స్నేహం ఉంది.. అయితే ఇందులో మెగాస్టార్, బాలయ్యకు మధ్య స్నేహబంధం మరింత ఎక్కువగా ఉంది.. ఒకరికొకరు సొంత లైఫ్ విషయంలో, కానీ సినిమాల పరంగా కానీ ఎంతో సహకారం అందించుకుంటూ ఇండస్ట్రీ లో దూసుకుపోతూ వస్తున్నారు..

Did Chiranjeevi make such a big sacrifice for Balayya Babu
అలా చిరంజీవి, బాలకృష్ణ సినిమా విషయంలో చాలా హెల్ప్ చేశారట.. ఏకంగా బాలకృష్ణ సినిమాకు చిరంజీవి ప్రమోషన్ చేసి సినిమా హిట్ అయ్యేలా చేశారు.. ఆ సినిమా ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. బాలకృష్ణ కేవలం మాస్ సినిమాలే కాకుండా లవ్, ఆధ్యాత్మిక, సైన్స్ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు.. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ తో ఎన్నో పాన్ ఇండియా చిత్రాలు వస్తున్నాయి.. కానీ టెక్నాలజీ అంతగా డెవలప్ కాకముందే మంచి గ్రాఫిక్స్ తో బాలకృష్ణ తీసిన ఒక సినిమా భారీ హిట్ సాధించింది. (Chiranjeevi)
Also Read: Balakrishna: ఆ సినిమా డిజాస్టర్ అంటూ బాలకృష్ణను అవమానించిన నిర్మాత.?
ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే..ఆదిత్య 369.. ఇది బాలకృష్ణ కెరియర్ లోనే ఒక స్పెషల్ అట్రాక్టివ్ గా నిలిచిపోయింది. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రల్లో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు.. అప్పట్లో ఈ సినిమా రిలీజ్ కి ముందు పబ్లిసిటీ చేయాలని భావించారట ప్రొడ్యూసర్ శివలంక కృష్ణప్రసాద్.. దీనికోసం దూరదర్శన్ లో యాడ్ కూడా ఇవ్వాలని భావించారట.. యాడ్ ఎలా ఇవ్వాలని ఆలోచన చేస్తున్న సమయంలో చిరంజీవితో ప్రచారం చేస్తే బాగుంటుందని అనుకున్నారట.

వెంటనే చిరంజీవిని సంప్రదించగానే ఆయన ఓకే అని చెప్పడమే కాకుండా ఆదిత్య 369 సినిమాను ప్రమోట్ చేశారు. ఈ విధంగా బాలకృష్ణ, చిరంజీవి మధ్య ఎప్పటినుంచో స్నేహబంధం కొనసాగుతూ వస్తోంది. ఇక ఇదే కాకుండా బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి మూవీకి కూడా చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి వారి అనుబంధం గురించి పంచుకున్నారు.. ఈ విధంగా బాలకృష్ణ, చిరంజీవి ఇండస్ట్రీలోనే గొప్ప స్నేహితులుగా పేరు తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు.(Chiranjeevi)