Mahesh Babu: దురదృష్టం అంటే ఇదే.. మహేష్ ఆ సినిమాని వదులుకున్నాడా.. నిజం ఏంటంటే.?


Mahesh Babu: ఈ ఏడాది ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.ఈ తరుణంలో ఫిబ్రవరి 14న బాలీవుడ్ పాన్ ఇండియా చిత్రం ఛావా మూవీ కూడా థియేటర్లలోకి వచ్చింది.. విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందాన కథానాయకగా వచ్చినటువంటి ఈ మూవీని లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ చేశారు.. అలాంటి ఈ చిత్రం రిలీజ్ అయినటువంటి మొదటి రోజు నుంచే అద్భుతమైన టాక్ తో దూసుకుపోతోంది.. అయితే ఈ చిత్రాన్ని చత్రపతి శివాజీ కుమారుడు శంబాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు..

 Did Mahesh Babu give up on that film

Did Mahesh Babu give up on that film

ఇందులో శంబాజీ పాత్రలో విక్కీ కౌశల్ ఆయన భార్య పాత్రలో ఏసుబాయ్ గా రష్మిక మందాన అద్భుతంగా నటించారని చెప్పవచ్చు.. అలాంటి ఈ మూవీ రిలీజ్ అయి వారం రోజులు గడిచింది. ఇప్పటికీ రెండు వందల కోట్లు వసూళ్లు దాటిపోయిందని, త్వరలోనే 400 కోట్ల వసూళ్ల దగ్గరకు కూడా వెళ్లబోతోందని అంటున్నారు. (Mahesh Babu)

Also Read: Kamal Haasan: ఆ హీరోను కెరీర్ నాశనం చేసిన కమల్ హాసన్.. కారణం ఆమెనా.?

ఇక సినిమా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న తరుణంలో మహేష్ బాబుకు ఈ సినిమాకు మధ్య ఒక పెద్ద స్టోరీ ఉందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అయితే ఈ సినిమాను ముందుగా లక్ష్మణ్ ఉటేకర్ మహేష్ బాబుతో తీయాలని అనుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. మరి ఇది నిజమేనా కాదా అనేదానిపై తాజాగా లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు..

 Did Mahesh Babu give up on that film

ఈ సినిమా కథ రాసే సమయంలో కేవలం విక్కీ కౌశల్ మాత్రమే నా మైండ్ లో ఉన్నారు.. నేను కలలో కూడా ఇంకో హీరోని ఊహించలేదు.. అసలు మహేష్ బాబును ఇప్పటివరకు కూడా నేను కలవలేదు.. అలాంటిది ఆయనతో ఈ సినిమా తీస్తానని మీరు ఎలా అనుకున్నారు అంటూ క్లారిటీ ఇచ్చారు.. దీంతో మహేష్ బాబుతో చాలా మూవీ తీస్తారనేది అబద్ధంగా తేలిపోయింది.. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో ఎస్ఎస్ఎంబి 29 మూవీ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు..(Mahesh Babu)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *