Rashmika: రష్మిక ఆ తెలుగు హీరోని కూడా బకరాని చేసిందా..?

Rashmika: రష్మిక సినిమాలతో ఫేమస్ అయినప్పటికీ వివాదాల వల్ల ఇబ్బందుల బారిన కూడా పడుతుంది. అలా రష్మిక తాను నటించిన మొదటి సినిమా పేరును చెప్పుకోవడానికి ఇష్టపడకపోవడంతో కన్నడ ఇండస్ట్రీ ఆమెపై తిరుగుబాటు మొదలుపెట్టింది. రష్మిక సినిమాలు చూడకుండా కన్నడిగులు ఆమెపై మండి పడుతున్నారు. అంతే కాదు కాంతార సినిమాని కూడా రష్మిక చూడలేదు అని చెప్పడంతో చాలామంది ఫైర్ అయ్యారు.
Did Rashmika even make that Telugu hero a fool
కానీ ఈ వ్యాఖ్యలపై రష్మిక స్పందించి నేను కాంతార సినిమా చూడలేదని చెప్పాను. ఎందుకంటే ఆ సినిమా విడుదలైన రెండు రోజులకే నాకు ఈ ప్రశ్న ఎదురయింది. నా బిజీ లైఫ్ లో అంత తొందరగా ఆ సినిమాని నేను చూడలేదు. ఆ తర్వాత సినిమా చూసి బాగుందని రిషబ్ శెట్టికి మెసేజ్ కూడా పెట్టాను.దానికి ఆయన థాంక్యూ అని కూడా అన్నారు.కానీ ఈ విషయం తెలియకుండా అలా వక్రీకరించడం చాలా బాధాకరం అని స్పందించింది. (Rashmika)
Also Read: Rishab Shetty: ఆ హీరోయిన్ ని పొగుడుతూ రష్మిక పరువు తీసిన రిషబ్ శెట్టి.?
అయితే కాంతార మూవీ సంగతి అటుంచితే ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా కిర్రిక్ పార్టీ పేరుని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఇక కేవలం ఈ సినిమా మాత్రమే కాదు తెలుగులో తన మొదటి మూవీ ఛలో సినిమాని కూడా గుర్తుపెట్టుకోవడం రష్మికకు ఇష్టం లేదు కావచ్చు.ఎందుకంటే ఓ ఇంటర్వ్యూలో ఛలో మూవీకి సంబంధించి ప్రశ్న ఎదురైనా కూడా తన ఫస్ట్ సినిమా గురించి స్పందించడానికి రష్మిక అంతగా ఆసక్తి చూపలేదు.

దాంతో రష్మిక కన్నడలోనే కాదు తెలుగు హీరో నీ కూడా బకరాని చేసినట్టు కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెట్టారు.అంతేకాదు ఛలో మూవీ సమయంలో రష్మిక కాస్త పొగరుగా బిహేవ్ చేసిందని కూడా అప్పట్లో నాగశౌర్య తన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నారట. అలాగే ఈ సినిమా విడుదలై రష్మిక స్టార్డం సంపాదించాక నాగశౌర్యని ఎవరో అన్నట్లుగా చూసిందని కూడా నాగశౌర్య తన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నట్టు ఆ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి.(Rashmika)