T20 WORLD CUP 2024: వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ శర్మ ఇండియాకి మాత్రం ఫేక్ డమ్మీ కప్ ను తీసుకొని వచ్చారు…. వినడానికి ఇది షాకింగ్ గా ఉన్నప్పటికీ ఇదే నిజం. ఇది ఫేక్ వరల్డ్ కప్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఈ ట్రోలింగ్ లో వాస్తవం ఉంది. ఎందుకంటే ఫైనల్ లో వరల్డ్ కప్ గెలిచిన రోజు ఐసీసీ ఇచ్చిన ట్రోఫీ ఒరిజినల్ నిజమైనదే. ఆరోజు ఆటగాళ్లందరూ ట్రోఫీని పట్టుకొని ఫోటోలు దిగారు. అప్పుడు వారు పట్టుకుని దిగిన ట్రోఫీ అసలైనదే. T2024 WORLD CUP 2024
Did Rohit and Co parade with fake World Cup Trophy in Mumbai
అప్పుడు ఐసీసీ ఆటగాళ్లకు ఇచ్చిన ట్రోఫీ అసలైనదే కానీ ఆ ట్రోఫీని సొంత దేశానికి తీసుకెళ్లడానికి మాత్రం ఐసిసి వారు అనుమతించరు. దానికి బదులుగా అచ్చం అలాంటిదే ఫేక్ కప్ ను చేతిలో పెట్టి ఇంటికి పంపించేస్తారట. ఇక అదే ఫేక్ కప్ ను తీసుకొని సొంత గడ్డపై సెలబ్రేషన్స్ చేసుకోవాలి. మరి నిజమైన ట్రోఫీని ఎక్కడ ఉంచుతారని అందరిలో సందేహం ఉంటుంది. T2024 WORLD CUP 2024
Also Read: Team India: ప్రధాని మోడీతో టీమిండియా .. జనసంద్రమైన ముంబై
అసలైన ట్రోఫీని దుబాయ్ లోని ఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో ఉంచుతారు. ఇప్పుడు అదే కాదు గత కొన్ని దశాబ్దాల నుంచి ఇదే రూల్ ఫాలో అవుతున్నారు. ఎందుకంటే వరల్డ్ కప్ అనేది చాలా విలువైనది. దానిని ఫోటోషూట్స్ కోసం ….బయట వాళ్లకు….. లీడర్స్ కు చూపిద్దామని …..ఇలా ఫ్యాన్స్ మధ్య సెలబ్రేషన్స్ కోసం దానిని తీసుకెళ్లే క్రమంలో ఏదైనా జరుగుతుందని ….అందుకే అలాకాకుండా ఒరిజినల్ వరల్డ్ కప్ ను ఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో భద్రంగా ఉంచుతారు. T2024 WORLD CUP 2024
ఫేక్ వరల్డ్ కప్ ను తీసుకొని ఆటగాళ్లు వారి సొంతగడ్డకి వెళ్తారు. 2007, 2011, 2013 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంలోనూ టీమిండియా చేతిలో ఇలాంటి ఫేక్ వరల్డ్ కప్ నే పెట్టారు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారగా….. పలువురు ట్రోలింగ్ చేస్తున్నారు. T2024 WORLD CUP 2024