Samantha: ఆ డైరెక్టర్ వల్లే సమంత బతికిందా.. లేకపోతే బాంబు దాడిలో..?
Samantha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమంత అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఏం మాయ చేసావే అనే మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా ద్వారా అద్భుతమైన హిట్ సాధించింది. ఈ మూవీ తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. అందులో కూడా మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలాంటి సమంత తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో జతకట్టింది.
Did Samantha survive because of that director
మహేష్ బాబుతో దూకుడు సినిమా చేస్తున్న సమయంలో ఒక ప్రమాదకరమైన ఘటన జరిగిందట. ఈ ఘటనలో సమంత ప్రాణాలు కూడా పోయేవట. కానీ ఆమె తృటిలో తప్పించుకుందని అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. అసలు విషయంలోకి వెళ్తే.. దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించిన దూకుడు సినిమా ఎంతటి హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఈ మూవీ షూటింగ్ కోసం టర్కీ వెళ్లారట చిత్ర యూనిట్.(Samantha)
Also Read: Pushpa 2 Tickets: పుష్ప 2 సినిమాపై మేకర్స్ తప్పుడు నిర్ణయం.. సినిమాపై భారీ ఎఫెక్ట్?
అయితే షూటింగ్ బ్రేక్ సమయంలో సమంత షాపింగ్ చేద్దామని ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళిందట. అయితే ఆ షాపింగ్ మాల్ దగ్గరే ఒక పెద్ద ఆత్మహుతి దాడి జరిగిందని, ఈ టైంలో తన ముందే ఎంతో మంది మరణించారని సమంత శీను వైట్లకు ఫోన్ చేసి చెప్పిందట. ఈ విషయం విన్న ఆయన షాక్ అయిపోయి మీకు ఏం కాలేదు కదా మేడం అంటూ వెంటనే సిబ్బందిని అలర్ట్ చేసి ఆమెను హోటల్ రూమ్ కి తరలించారట.
ఆ టైంలో సమంత తృటిలో తప్పించుకుందని, లేదంటే ఆ దాడిలో ఆమె ప్రాణాలు కూడా పోయావని శ్రీను వైట్ల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇది విన్న సమంత అభిమానులు సమంతకు ఎప్పుడూ ఆ దేవుడు అండగా ఉంటాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Samantha)