Sandeep Kishan: సందీప్ కిషన్ ఆ హీరోయిన్ చేతిలో మోసపోయాడా..లవ్ స్టోరీ వింటే.?
Sandeep Kishan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలు ఉన్నారు. ఇందులో చాలామంది సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో సందీప్ కిషన్ ఒకరు.. ఈయన సినిమా కెరియర్ లో ఒక సినిమా హిట్ అయితే మరో రెండు సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి.. ఆ విధంగా సందీప్ కిషన్ ఇండస్ట్రీలో హిట్స్ ప్లాప్స్ అనే పదాన్ని పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్తున్నారు.కేవలం సినిమాల్లోనే కాకుండా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ తనకు ఎదురు లేదు అనిపించుకుంటున్నారు..

Did Sandeep Kishan get cheated by that heroine
అయితే ఈ మధ్యకాలంలో ధనుష్ హీరోగా వచ్చిన రాయన్ చిత్రంలో కీలక పాత్రలో నటించి అదరహో అనిపించారు.. అలాంటి సందీప్ కిషన్ తాజాగా మజాకా అనే సినిమాలో నటించి ఆ సినిమాకు సంబంధించి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తనకు సంబంధించిన పర్సనల్ విషయాలు అన్నింటిపై క్లారిటీ ఇచ్చారు.. అంతేకాదు తనకు లవ్ స్టోరీ కూడా ఉందని రివీల్ చేశారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తన 15 సంవత్సరాల సినీ కెరియర్ లో సందీప్ కిషన్ ఎన్నో పాత్రలు చేశారు.. (Sandeep Kishan)
Also Read: Kamal Haasan: ఆ హీరోను కెరీర్ నాశనం చేసిన కమల్ హాసన్.. కారణం ఆమెనా.?
సినిమా హిట్, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా నటనను మాత్రమే నమ్ముకున్న సందీప్ కిషన్ ‘ప్రస్థానం’ అనే చిత్రం ద్వారా తెలుగింటిలోకి అడుగుపెట్టి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.. అలాంటి ఈయన గత ఏడాది ‘ఊరు పేరు భైరవకోన’ అనే చిత్రం ద్వారా అద్భుతమైన హిట్ అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చారు.. అలాంటి సందీప్ కిషన్ ను ఒక యాంకర్ నీకు ఒక లవర్ ఉందట కదా నిజమేనా అని ప్రశ్నించగా.. అవును మీరు అన్నది నిజమే నాకు ఉన్నది ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్..

ఆమెతో నాలుగు సంవత్సరాల పాటు కలిసి ఉన్నాను.. కానీ మా మధ్య చిన్న చిన్న గొడవల వల్ల మా బంధం విచిన్నమైంది.. ఇక అప్పటినుంచి ఏ అమ్మాయితో కూడా నేను రిలేషన్ పెట్టుకోలేదని చెప్పుకొచ్చారు.. ఈ విధంగా సందీప్ కిషన్ తన లవర్ గురించి రివీల్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.. ఆ అమ్మాయి ఎవరా అని వెతికే పనిలో పడ్డారు నెటిజన్స్.. మీకు అమ్మాయి ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి..(Sandeep Kishan)