Suman: సుమన్ జైలుకు వెళ్లడం వల్ల ఆ హీరోకి అదృష్టం పట్టుకుందా.?

Suman: ఇప్పుడైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా పలు సినిమాల్లో రాణిస్తున్న సుమన్ ఒకప్పుడు స్టార్ హీరో.. జైలుకెళ్లకపోయి ఉంటే సుమన్ మెగాస్టార్ చిరంజీవికి పోటీగా వచ్చేవాడని ఎంతోమంది అప్పటి జనరేషన్ వాళ్ళు అంటూ ఉంటారు. అయితే అలాంటి సుమన్ నీలి చిత్రాల కేసులో జైలు జీవితం గడిపి రావడంతో ఆయనకున్న అవకాశాలన్నీ ఇతర హీరోలకు వెళ్లిపోయాయి.
Did Suman going to jail bring good luck to the hero
అంతేకాదు జైలుకు వెళ్లకపోయి ఉంటే సుమన్ జీవితం మరోలా ఉండేది. కానీ ఆయన దురదృష్టం కొద్ది చెయ్యని తప్పుకు జైలు పాలయ్యి చివరికి కెరీర్ నాశనం చేసుకున్నారు. అయితే అలాంటి సుమన్ జైలుకు వెళ్లడం తో మరో హీరోకి ఆ అదృష్టం కలిసి వచ్చిందట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే రాజశేఖర్.. సుమన్ రాజశేఖర్ వీరిద్దరికీ తెలుగు సరిగ్గా రాదు.(Suman)
Also Read: Harish Shankar: తమ్ముడి వల్లే నేను పిల్లల్ని కనడం లేదు.?
వీళ్ళిద్దరికీ సాయికుమార్ వాయిస్ ఇచ్చేవారు. అలా సుమన్ జైలుకు వెళ్లడంతో సాయికుమార్ తన వాయిస్ రాజశేఖర్ కి ఇవ్వాల్సి వచ్చింది.అయితే ఓ సినిమాలో రాజశేఖర్ తో పాటు సాయికుమార్ కూడా నటించారు. ఆ టైంలో నా వాయిస్ ఆయనకి ఇస్తే తేడా కొడుతుంది అని చెప్పిన కూడా డైరెక్టర్ నిర్మాత వినకుండా ఏం కాదు మీ వెర్షన్ వచ్చినప్పుడు మీరు వేరే విధంగా గొంతు మార్చి మాట్లాడండి అని చెప్పి రాజశేఖర్ కి సాయికుమార్ తో వాయిస్ ఇప్పించారట.

అలా సాయికుమార్ వాయిస్ తో రాజశేఖర్ ఎన్నో బ్లాక్బస్టర్ హిట్స్ కొట్టారు. దాంతో సుమన్ కి ఉన్న అవకాశాలన్నీ రాజశేఖర్ ఖాతాలోకి వచ్చాయట.అలా సుమన్ దురదృష్టం కొద్దీ జైలుకు వెళ్లగా రాజశేఖర్ అదృష్టం బాగుండి సినిమాల్లో ఆఫర్స్ ఎక్కువగా వచ్చాయట.(Suman)