Chiranjeevi: ప్యాంటు చిరిగి పరువు పోగొట్టుకున్న చిరంజీవితో ఆ హీరోయిన్ అలా ప్రవర్తించిందా.?
Chiranjeevi: చిరంజీవి ఈ పేరులో ఏముంటుందో ఏమో పలికినప్పుడల్లా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది.. అలాంటి చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే ఒక అద్భుతమైన హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చాలా కష్టపడి మెగాస్టార్ అయ్యాడు.. అలాంటి చిరంజీవి ఇండస్ట్రీలో ఉండేటువంటి చాలామంది హీరోయిన్లతో జతకట్టారు.. అలాంటి చిరంజీవితో అప్పట్లో కొన్ని హిట్ కాంబినేషన్స్ ఉండేవి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాధిక..
Did that heroine behave like that with Chiranjeevi
ఇద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. అప్పట్లో రాధిక హీరోయిన్ గా వస్తుంది అంటే థియేటర్లు మొత్తం నిండిపోయేవి.. అలా వీరిద్దరి కాంబినేషన్ ఎంతో సెట్ అయిపోయేది. అలాంటి రాధికాకు చిరంజీవికి ఒక నిమిషం కూడా పడేది కాదట. తరచూ ఇద్దరూ ఏదో ఒక విధంగా కొట్లాడుకునే వారట.. అంతేకాదు చిరంజీవి కంటే ముందే రాధిక ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ పొందింది. దీంతో చిరంజీవిని ఆమె చాలా చులకనగా చూసేదని దీనివల్ల చిరంజీవికి నచ్చేది కాదని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి.. (Chiranjeevi)
Also Read: Allu Arjun Next Movie: అల్లు అర్జున్ కొత్త సినిమా షూటింగ్ డేట్? 300 కోట్ల భారీ ప్రాజెక్ట్!!
అలా ఇద్దరి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత వైరం ఉన్నా కానీ ఓసారి చిరంజీవి పరుగును కాపాడిందట రాధిక.. వీరిద్దరూ కలిసి అభిలాష సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఎత్తు ప్రాంతం నుంచి చిరంజీవి కిందకి దూకాలి. షూటింగ్ సమయంలో కెమెరామెన్ దర్శకనిర్మాతలు దూరంగా ఉన్నారట. చిరంజీవి దూకుదాం అనే సమయానికి ప్యాంటు చిరిగిపోయిందట.. దీంతో చిరంజీవి ఏం చేయాలో అర్థం కాక కాస్త సిగ్గుతో తలదించుకున్నారట.
మెల్లిగా రాధిక దగ్గరికి వచ్చి నా ప్యాంటు చిరిగింది కాస్త నీ చీరతో కవర్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళమని చెప్పారట.. దీంతో అర్థం చేసుకున్న రాధిక తాను ముందు నడుస్తూ చీర అడ్డంపెట్టి చిరంజీవిని కారవ్యాన్ వరకు తీసుకెళ్లిందట.. దీంతో చిరంజీవి మరో ప్యాంటు వేసుకొని వచ్చారట. వీరిద్దరూ అలా క్లోజ్ గా నడుచుకుంటూ వచ్చేసరికి షూటింగ్ సెట్లో అంతా షాక్ అయిపోయారట. ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా ఉండే వీరు ఇలా కలిశారు ఏంటని అనుకున్నారట.. కానీ అసలు విషయం తర్వాత తెలిసి అందరూ నవ్వుకున్నారని రాధిక ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.(Chiranjeevi)