Devi Movie: “దేవి” మూవీలోని పాము అభం శుభం తెలియని బాలుడి ప్రాణం తీసిందా.. షాకింగ్ నిజం.?
Devi Movie: దేవి మూవీ.. ఒకప్పుడు ఈ సినిమా ఎంత పెద్ద రికార్డు క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. సోషియ ఫాంటసీ మూవీగా తెరకెక్కిన దేవి మూవీకి కోడి రామకృష్ణ డైరెక్షన్ చేశారు. ఎంఎస్ రాజు ఈ సినిమాని నిర్మించారు. అలాగే ఈ సినిమాలో వనిత, ప్రేమ,సిజూ, భానుచందర్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా భక్తురాలిని కాపాడుకోవడం కోసం దేవి నాగమ్మ భూలోకం వచ్చి తన భక్తురాలిని ఎలా కాపాడుకుంటుంది అనేది స్టోరీ.అయితే ఈ సినిమాలో ఎక్కువగా పాములే కనిపిస్తాయి.

Did the snake in the Devi Movie take the life of the boy
ఇక సినిమాల్లో పాములను తీసుకుంటే కచ్చితంగా వాటిలో ఉన్న విషం తీసేస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం విషం తీసేసిన పాము ద్వారా ఒక బాలుడు మరణించాడట. అయితే ఈ విషయం చాలామందికి ఇప్పటివరకు తెలియదు. కానీ తాజాగా దేవి ప్రసాద్ అనే నటుడు దర్శకుడు తన ఫేస్బుక్లో ఈ విషయాన్ని చెప్పారు.ఆయన మాట్లాడుతూ..ఈ సినిమా షూట్ చేసే టైంలో భాయ్ అనే వ్యక్తి పాములను అందించాడు. అయితే ఆయన తీసుకువచ్చే పాములన్నింటికీ విషం ఉండదు.(Devi Movie)
Also Read: Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ కి హ్యాండ్ ఇచ్చిన హీరోయిన్.. ఆ హీరోతో ముద్దులు పెట్టుకుంటూ.?
కానీ బాయి దగ్గర పనిచేసే మణి అనే కుర్రాడు ఓ రోజు భాయ్ రాకపోవడంతో మణి పాములను తీసుకువచ్చాడు. ఆరోజు సీన్ షూట్ చేస్తుండగా సంచిలో ఒక పాము తెగ హడావిడి చేస్తుండడంతో దాన్ని పైకి తీసి కోపంతో మణి కసురుకున్నాడు. దాంతో ఆ కుర్రాడు మీదికి పాము వచ్చి నాలుగైదు సార్లు కరిచింది.కానీ దీంట్లో విషం లేదు నాకేం కాదు అని ఆ కుర్రాడు చెప్పినప్పటికీ మేము నమ్మలేదు.ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ బాలుడి చేయి వాయడంతో పాటు వాంతులు చేసుకోవడంతో మాకు డౌట్ వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్లాం.

ఆ తర్వాత కొద్దిసేపటికి మణి అనే కుర్రాడు చనిపోయినట్టు ఫోన్ కాల్ వచ్చింది.దాంతో నాకు ఒక్కసారిగా కాలు కింద ఉన్న భూమి అదిరినట్టు అయింది చాలా ఏడ్చాం. ముఖ్యంగా ఆ కుర్రాడికి తల్లిదండ్రులు ఎవరూ లేరు. అనాధల స్టూడియో చుట్టూ తిరగడంతో భాయ్ అనే వ్యక్తి వాడిని చేరదీసి తిండిపెట్టి తనతో పాటే పనికి తీసుకువెళ్లాడు. ఈ విషయం తెలియడంతోనే భాయ్ వాడి అమ్మానాన్న ఎవరో తెలియదు. అనాధలా నా దగ్గరికి వచ్చాడు అనాధలాగే ఈ వైజాగ్ మట్టిలో కలిసిపోతున్నాడు అని బోరున ఏడ్చాడు అంటూ దేవి ప్రసాద్ ఇప్పటివరకు తెలియని ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు.(Devi Movie)