Diet for reducing cholesterol levels

Cholesterol: బాడీలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సమస్యలు వస్తాయి. మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె గుండెని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపై బాగా ఎఫెక్ట్ పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే ముందు నుండి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవాలి. దీంతో గుండె ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. దీని కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో ఇప్పుడు చూద్దాం.

Diet for reducing cholesterol levels

ఈరోజు వారి ఆహారంలో చిక్కుళ్ళు, బీన్స్ తీసుకోవడం చాలా మంచిది. దీని తీసుకోవడం వల్ల బాడీకి మంచి ప్రోటీన్ అందుతాయి. ప్రోటీన్ కారణంగా బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే చేపలు, వాల్ నట్స్, అవిసెలు వంటి ఒమేగా 3 ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం గుండెకు చాలా మంచిది. ఒమేగా 3 బాడీలో మంటని తగ్గించి గుండె పని తీరుని మెరుగు చేస్తుంది. కాబట్టి వీటిని రెగ్యులర్ గ మీ డైట్ లో తీసుకోండి.

Also Read: Pushpa 2: పుష్ప 2 కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్న సుకుమార్.. ఫలించేనా?

ఎక్కువగా ఫైబర్ ఉన్న ఫుడ్స్ ని తీసుకోవాలి. దీనివల్ల బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనికోసం మీరు ఓట్స్, బార్లీ, పండ్లు, ఫైబర్ రీచ్ కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబు తున్నారు. యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే పండ్లు ఊరగాయలు పుష్కలంగా తినడానికి ప్రయత్నించండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

అలాగే రెగ్యులర్ గా వర్కౌట్ లు చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. వారానికి 150 నిమిషాల పాటు వర్కౌట్ చెడు కొలెస్ట్రాన్ని తొందరగా తగ్గిస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండెని కాపాడుకోవడానికి రెగ్యులర్ ఎక్సర్ సైజ్ బెస్ట్ అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. గుండె ఆరోగ్యం కాపాడుకోవడానికి బరువు చాలా ముఖ్యము మంచి హెల్దీ ఫుడ్ రోజు తీసుకోవాలి. వర్కౌట్స్ చేయాలి. అలాగే మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. ఎత్తుని బట్టి ఎంత బరువు ఉండాలో డాక్టర్ నీ కనుక్కొని ఆ బరువుని మెంటెయిన్ చేయవచ్చు.