Telangana: భట్టి విక్రమార్క – పొంగులేటి మధ్య విబేధాలు.. ఇదిగో సాక్ష్యం!?
Telangana: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రామసభల పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇండ్లు అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండిటితో పాటు రైతు బంధు, ఇందిరమ్మ భరోసా పథకాలకు కూడా అప్లికేషన్లను తీసుకుంది.
Differences between Bhatti Vikramarka and Ponguleti
మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి ఈ.. నాలుగు పథకాలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే మూడు రోజులపాటు గ్రామసభలు నిర్వహించి… అప్లికేషన్లను తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ గ్రామసభల గడువు ముగియడంతో… బట్టి విక్రమార్క అలాగే మంత్రి ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి.
తీసుకున్న అప్లికేషన్ల నుంచి లబ్ధిదారుల పేర్లను… రేపటి నుంచి ప్రకటిస్తామని బట్టి విక్రమార్క ప్రకటించారు. రేపటి నుంచి నాలుగు పథకాలు అమలులోకి వస్తాయని కూడా తెలిపారు. అదే సమయంలో ఫిబ్రవరి నుంచి ఈ పథకాలు అమలవుతాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. దీంతో జనాలు గందరగోళంలో పడ్డారు. పొంగులేటి అలాగే… భట్టి విక్రమార్క మధ్య గొడవలు జరుగుతున్నాయని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.