Perni Nani: నీ అరెస్ట్‌ లో నా రోమాలు కూడా ఊడవు ?


Perni Nani: నీ అరెస్ట్‌ లో నా రోమాలు కూడా ఊడవు అంటూ మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా మంత్రి కొల్లు రవీంద్ర వర్సెస్‌ పేర్ని నాని మధ్య వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది నవంబర్ నుండి అరెస్టు చేస్తానంటూ మొరుగుతున్నావంటూ మండిపడ్డారు.

Differences between Mantri Kollu Ravindra vs Perni Nani

నీ అరెస్టుల వల్ల నా చేతి మీద రోమాలు కూడా ఊడవని… అరెస్టులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు పేర్ని నాని. అనధికారికంగా కొందరు వైసిపి నేతలు,కార్యకర్తల ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేస్తున్నారని ఆగ్రహించారు. నా ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు మా పార్టీ కార్యకర్తల ఫోన్ నంబర్స్ ఇటీవల కలెక్ట్ చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను భయపడటం లేదని తెలిపారు.

BRS Party: బీఆర్‌ఎస్ భవిష్యత్తు పై కేసీఆర్ సంచలన ప్రకటన!!

ట్యాప్ చేస్తున్నారనే టీడీపీ లీడర్స్ నీ కావాలని ఇంకా ఎక్కువ తిడుతున్నానని చురకలు అంటించారు. విజయవాడలో అనధికారికంగా చంద్రబాబు బంధువు ప్రకాష్ అనే ఒక వ్యక్తి సిబ్బందిని నియమించుకుని ఫోన్స్ చేసి వైసిపి నేతలను బేధిరించాలాని చూస్తున్నారని ఆగ్రహించారు. విజయవాడలో రమేష్ ఆసుపత్రి దగ్గర ఆఫీసు పెట్టీ అనధికారికంగా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. క్రిష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే ఇదంతా చేస్తున్నారన్నారు పేర్ని నాని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *