Raghavendra Rao: రాఘవేంద్రరావుతో రాజమౌళి అన్నకి విభేదాలు..?

Raghavendra Rao: ఏంటి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో దర్శకధీరుడు రాజమౌళి అన్న ఎంఎం కీరవాణికి విభేదాలా.. నిజంగానే వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయా.. అసలు ఆ రైటర్ చెప్పిన దాంట్లో ఉన్న నిజం ఎంత.. వీరి మధ్య గొడవలు రావడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరి మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి సహజం.
Differences between Rajamouli brother and Raghavendra Rao
అయితే కొంతమంది ఆ గొడవలు సర్దుకొని ముందుకు వెళుతూ ఉంటారు. మరి కొంత మంది మాత్రం ఆ గొడవలు అలాగే పెద్దవి చేస్తూ ఒకరిపై ఒకరు పగలు పెంచుకుంటూ ఉంటారు.అలా దర్శకధీరుడు అయినటువంటి రాజమౌళి సోదరుడు ఎంఎం కీరవాణికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి మధ్య కూడా అప్పట్లో వివాదాలు తలెత్తేయట.అయితే వీరి మధ్య విభేదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. (Raghavendra Rao)
Also Read: Rajendra Prasad: ఒరేయ్ దొంగా అంటూ స్టార్ క్రికెటర్ ని స్టేజ్ మీదే తిట్టిన రాజేంద్రప్రసాద్.?
చాలామంది సెలబ్రిటీలు పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. అలా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా ఓ రోజు రచయిత తోట ప్రసాద్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావుకి నాకు మధ్య విభేదాలు ఉన్నాయి. నేను ఎప్పటికీ రాఘవేంద్రరావు సినిమాకి మ్యూజిక్ అందించను. ఇప్పటి నుండి ఆయన చేసే సినిమాల్లో నేను చేయను అంటూ చెప్పుకొచ్చారట.

అయితే స్టార్ డైరెక్టర్ అయిన రాఘవేంద్రరావు పై ఇలాంటి ఆరోపణలు చేసిన విషయం గురించి రాయాలా వద్దా అని కన్ఫ్యూజన్ లో ఉండి చివరికి రాసారట.అయితే ఈ విషయం పేపర్లో వచ్చినా కూడా రాఘవేంద్రరావు అదంతా చదివి సైలెంట్ గా ఉన్నారట కానీ కీరవాణి చేసిన ఆరోపణలకి వ్యతిరేకంగా కౌంటర్ కూడా ఇవ్వలేదట. అలా రాఘవేంద్రరావు ఆరోజు చాలా హుందాగా నడుచుకున్నారు అంటూ తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.(Raghavendra Rao)