Yash: యష్ రాధికల మధ్య విభేదాలు.. 10 రోజులైనా ఇంటికి వెళ్లకుండా షూటింగ్లోనే..?
Yash: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు స్టార్ స్టేటస్ అనేది ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు.. ఓవర్ నైట్ లోనే ఎంతోమంది స్టార్లుగా మారతారు. కొంతమంది కింద పడిపోతారు.. అలా ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారారు హీరో యష్.. అంతకు ముందు ఈయన పేరు పెద్దగా తెలిసి ఉండేది కాదు.. ఎప్పుడైతే ఈయన కేజీఎఫ్ సినిమాలో నటించారో అప్పటినుంచి యష్ అంటే దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది.. గోల్డ్ తవ్వకాల బ్యాక్ డ్రాప్ తో పాటుగా తల్లి ప్రేమను అద్భుతంగా చూపిస్తూ సాగిన ఈ చిత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది.

Differences between Yash and Radhika
ఇందులో యష్ నటన వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ముందుగా కేజీఎఫ్ తో మన ముందుకు వచ్చి అద్భుతమైన హిట్ అందుకున్న ఈ హీరో కేజీఎఫ్ 2తో కూడా తనకు సాటి లేరు అనిపించుకున్నారు. ఇలా రెండు చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించారు. ఈ చిత్ర తర్వాత గీతా మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సీక్ అనే చిత్రం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో కథానాయికగా నయనతార చేస్తున్నట్టు తెలుస్తోంది… ఇదంతా బాగానే ఉన్నా యష్ వైవాహిక జీవితం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. (Yash)
Also Read: Tandel: తండేల్ సినిమా ప్లస్లు మైనస్లు.. ఆ మిస్టేక్ లేకపోతే సినిమా బ్లాక్ బస్టర్.?
ఆయన తన భార్యతో విభేదాలు పెట్టుకున్నారని గత వారం పది రోజులుగా తన ఇంటికి వెళ్లడం లేదని నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. యష్ టాక్సీక్ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారట.. ఇదే తరుణంలో ఇతర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేసుకుని ఈ మధ్యకాలంలోనే బెంగళూరుకు వచ్చారట.. అయితే బెంగళూరులో కూడా గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతున్న యష్ తన ఇంటికి వెళ్లడం లేదట..

షూటింగ్ ముగిశాక అంతకుముందు త్వరగా ఇంటికి వెళ్లే యష్ గత కొన్ని రోజులుగా మాత్రం యష్ తన ఇంటికి అసలు వెళ్లడం లేదని ఒక చర్చ సాగుతోంది. ఈ తరుణంలో నేటిజన్స్ యష్ రాధికకు గొడవలు జరిగాయని అందువల్లే ఆయన ఇంటికి వెళ్లకుండా షూటింగ్ సెట్ లోని కేరవాన్ లోనే ఉంటున్నారని చర్చించుకుంటున్నారు.. ఇందులో ఎంతవరకు నిజం ఉందో, అబద్ధం ఉందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అయితే మరికొంతమందేమో సినిమా షూటింగ్ బిజీలో పడి ఇంటికి వెళ్లడం లేదని అంటున్నారు. మరి దీనిపై యష్ లేదా తన భార్య స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.(Yash)