Shalini Pandey: షాలినికి అవమానం.. బట్టలు విప్పాక సడన్ గా డైరెక్టర్ డోర్ తీసి.?


Director insult Shalini Pandey

Shalini Pandey: కొంతమంది హీరోయిన్లు నటించిన ఒక్క సినిమాతోనే ఫేమస్ అవుతారు. అలా పాపులర్ అయిన హీరోయిన్ లలో శాలిని పాండే కూడా ఒకరు.అర్జున్ రెడ్డి మూవీతో ఎక్కడలేని క్రేజ్ సంపాదించిన శాలిని పండే ఈ సినిమా తర్వాత చేసిన ఏ సినిమాలు కూడా హిట్ కాకపోయినప్పటికీ అర్జున్ రెడ్డి సినిమా నటిగానే గుర్తుండిపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ డైరెక్టర్ ద్వారా చేదు అనుభవం ఎదురయింది అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొని బాధపడింది.

Director insult Shalini Pandey

ఇక విషయంలోకి వెళ్తే.. చాలామంది హీరోయిన్లు షూటింగ్ సెట్లో బట్టలు చేంజ్ చేసుకునే సమయంలో కేరావ్యాన్ లోకి వెళ్లి బట్టలు మార్చుకుంటూ ఉంటారు. అయితే అలాగే ఓ రోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో క్యారవాన్లకు వెళ్లి శాలిని పాండే బట్టలు మార్చుకుంటున్న సమయంలో సడన్గా ఆ మూవీ డైరెక్టర్ డోర్ కొట్టకుండానే డోర్ తీసి గబుక్కున లోపలికి వచ్చేసారట.(Shalini Pandey)

Also Read: Nayanthara: ఛీ ఛీ కారులో ఆ పని చేయాలా.. నో అంటూ హిట్ సినిమాని రిజెక్ట్ చేసిన నయనతార.?

ఇక డైరెక్టర్ చూసిన శాలిని పాండే ఒక్కసారిగా ఇక్కడికి ఎందుకు వచ్చారు.నా అనుమతి లేకుండా ఎందుకు వచ్చారు అంటూ గట్టిగా కేకలు వేసిందట. దాంతో అందరూ రావడంతో వెంటనే ఆ డైరెక్టర్ వెను తిరిగి వెళ్లిపోయారట. అయితే శాలిని పాండే ప్రవర్తించిన తీరుకి అక్కడే ఉన్న కొంతమంది మీరు అలా కేకలు వేయాల్సి ఉండకూడదు అని అన్నారు.కానీ నేను మాత్రం నేనేమీ తప్పు చేయలేదు.

Director insult Shalini Pandey

చేయాల్సిందే చేశాను.అది నాకు తప్పుగా అనిపించడం లేదు అంటూ ఆన్సర్ ఇచ్చాను. అయితే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంతోమంది సపోర్ట్ చేశారు. కానీ ఇలాంటి వారి వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను. అలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఇండస్ట్రీలో రాణించాను అంటూ శాలిని పాండే చెప్పుకొచ్చింది. కానీ శాలిని పాండే బట్టలు మార్చుకున్నప్పుడు క్యారవాన్లకు వచ్చిన డైరెక్టర్ ఎవరో మాత్రం పేరు బయట పెట్టలేదు.(Shalini Pandey)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *