Director Vamshi: భానుప్రియతో శారీరకంగా.. డైరెక్టర్ వంశీ సంచలన కామెంట్స్.?
Director Vamshi: డైరెక్టర్ వంశీ అంటే ఇప్పటి జనరేషన్ సినీ ప్రేక్షకులకు కూడా తెలిసినవారు.ఎందుకంటే ఈయన తీసిన సినిమాలు ఇప్పటికి కూడా ప్రేక్షకులతో ఆదరించబడుతున్నాయి. అయితే అలాంటి డైరెక్టర్ స్టార్ హీరోయిన్గా ఉన్న భానుప్రియను అప్పట్లో ప్రేమించిన సంగతి మనకు తెలిసిందే.ఇక భానుప్రియను ఇండస్ట్రీకి సితార సినిమా ద్వారా పరిచయం చేశారు వంశీ.అయితే ఈ సినిమా కంటే ముందు భానుప్రియ వేరే సినిమా చేసినప్పటికీ సితార సినిమా ద్వారా మాత్రమే భానుప్రియకు క్రేజ్ వచ్చింది.

Director Vamshi sensational comments Bhanupriya
ఆ తర్వాత వంశీ డైరెక్షన్ లోనే స్వర్ణకమలం, విజేత వంటి ఎన్నో హిట్ సినిమాలు చేసింది. అలా ఎక్కువ సినిమాలు వంశీతో చేసేసరికి చాలామంది వీరి మధ్య ఏదో నడుస్తుంది అని పుకార్లు పుట్టించారు. అయితే ఆ పుకార్లు నిజమే..ఎందుకంటే వంశీ, భానుప్రియ ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి భానుప్రియ తల్లి విలన్ అయింది. డైరెక్టర్ ని పెళ్లి చేసుకోవడం కుదరదు అని భానుప్రియ తల్లి తేల్చి చెప్పడంతో చేసేదేమీ లేక భానుప్రియ తన ప్రేమను వదులుకుందట. (Director Vamshi)
Also Read: Kriti Shetty: అవకాశాలు రాకపోవడంతో ఆ పని చేస్తున్న బేబమ్మ!!
అయితే ఆ మధ్యకాలంలో భానుప్రియ, వంశీ ఇద్దరు శారీరకంగా కలిశారని,వారిద్దరి మధ్య ఎఫైర్ ఉంది అని వార్తలు వచ్చాయి.కానీ ఈ వార్తల్లో నిజం లేదు అని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో వంశీ తేల్చేశారు.భానుప్రియ నేను ప్రేమించుకుంది నిజమే. మా పెళ్ళికి భానుప్రియ తల్లి విలన్ గా మారారు. కానీ మా ఇద్దరి మధ్య శారీరక సంబంధం అయితే లేదు అంటూ చెప్పారు.

ఇక వంశీ తో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్న భానుప్రియ తర్వాత ఆదర్శ్ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఇక ఆదర్శ్ కౌశల్ 2018లో హార్ట్ ఎటాక్ తో మరణించిన సంగతి తెలిసిందే.భర్త చనిపోయాక భానుప్రియ చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె మానసిక పరిస్థితి కూడా అంతగా బాగోలేదు. ప్రతి చిన్న విషయాన్ని తొందరగా మర్చిపోతూ మతిమరుపు వ్యాధి కూడా వచ్చింది.(Director Vamshi)