Brahmanandam: కమెడియన్లని బ్రహ్మానందం చీప్ గా చూసేవారా.. 20 మంది కమెడియన్ల గొడవ.?
Brahmanandam: కమెడియన్లు అంటే ఇండస్ట్రీలో చాలామంది గుర్తుకు వస్తారు. కానీ ఇప్పటి జనరేషన్ వాళ్లకు అయితే బ్రహ్మానందమే గుర్తుకొస్తారు. ఆయన తన మొహంతోనే చూసే వారికి నవ్వు పుట్టిస్తారు. అలా కామెడీ ఫేస్ తో కామెడీయన్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయిన బ్రహ్మానందం ఇప్పటికే వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. ఇక బ్రహ్మానందం రీసెంట్గా తన కొడుకు అలాగే వెన్నెల కిషోర్ తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమా చేశారు.ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

Do Brahmanandam see comedians as cheap
అయితే అలాంటి బ్రహ్మానందం నిజంగానే ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్ల అందరిని చీప్ గా చూసేవారా.. వారిపై ఆధిపత్యం చెలాయించాలని చూసేవారా.. ఇంతకీ ఆ 20 మంది కమెడియన్లు బ్రహ్మానందం కి వ్యతిరేకంగా ఎందుకు మీటింగ్లు పెట్టుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.బ్రహ్మానందం తో పాటు ఇండస్ట్రీలో ఉండే చాలామంది కమెడియన్లకు బ్రహ్మానందం అంటే నచ్చేవారు కాదట. చాలాసార్లు వారితో ఆయన గొడవ పెట్టుకునే వారట.ఆధిపత్యం చేయాలని చూసేవారట. (Brahmanandam)
Also Read: Chiranjeevi: బాలకృష్ణనే కాదు చిరంజీవి కూడా ఆ చండాలమైన పని చేశారు.. నిర్మాత సంచలనం.?
దాంతో బ్రహ్మానందంతో గొడవ పెట్టుకున్న దాదాపు 20 మంది కమెడియన్లు ఒక దగ్గర మీటింగ్ పెట్టుకొని బ్రహ్మానందం చేసే ఆధిపత్యం గురించి వారిలో వారే చర్చించుకున్నారట.అయితే ఈ మీటింగ్ కి ప్రముఖ దివంగత కమెడియన్ అయినటువంటి ఏవీఎస్ పెద్దగా వ్యవహారించారు.అయితే ఆ మీటింగ్ అయిపోయాక ఓసారి షూటింగ్లో బ్రహ్మానందం కలిసిన సమయంలో మీరు ఎందుకు మొన్న మీటింగ్ పెట్టుకున్నప్పుడు వెళ్ళలేదు అని ప్రముఖ కమెడియన్ పోలప్రగడ జనార్దన్ రావు ని బ్రహ్మానందం అడిగారట.

అయితే ఆయన మాటలకు జనార్దన్ రావు ఏమో నన్ను పిలవలేదు. ఒకవేళ పిలిచి ఉంటే వెళ్లేవాడిని కావచ్చు. అయినా ఆ 20 మంది కమెడియన్లు మీతో గొడవ పెట్టుకున్న వాళ్లే. మీతో నాకు ఎలాంటి గొడవ లేదు. కాబట్టి ఆ మీటింగ్ కి నన్ను పిలవలేదు.మీతో గొడవ పెట్టుకున్న వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు అంటూ జనార్దన్ రావు బ్రహ్మానందంతో అన్నారట. దాంతో బ్రహ్మానందం అవును ఇది కూడా నిజమే నీకు నాతో గొడవలు లేవు కదా అని చెప్పారట. అయితే ఈ గొడవ గురించి ప్రెస్ మీట్ పెట్టి పెద్దది చేద్దాం అనుకున్నారట. కానీ ఇందులో చిరంజీవి కల్పించుకొని ఆ గొడవ సర్దుమణిగేలా చేశారని పోలప్రగడ జనార్దన్ రావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.(Brahmanandam)