Jamun Fruit: ఎండా కాలంలో నేరేడు పండ్లు తింటున్నారా…అయితే ఇవి తెలుసుకోండి?


Jamun Fruit: సీజనల్ ఫ్రూట్ నేరేడు పండ్లు అంటే చాలామందికి ఇష్టం. ఈ నేరేడు పండ్లు వేసవికాలం ముగిసే సమయానికి అధికంగా లభ్యమవుతాయి. నేరేడు పండ్లలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు, ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సర్, కాలేయ సంబంధ వ్యాధులను నివారించడంలో నేరేడు పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్, విటమిన్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే నేరేడు పండ్లను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం….

Do you eat apricots during the dry season

డయాబెటిస్ పేషెంట్లు నేరేడు పండ్లకు చాలా దూరంగా ఉండాలి. డయాబెటిస్ పేషెంట్లు నేరేడు పండ్లను తిన్నట్లయితే షుగర్ లెవెల్స్ చాలా త్వరగా తగ్గుతాయి. దీనివల్ల వారు అనారోగ్యం పాలవుతారు. అంతేకాకుండా మలబద్ధకం సమస్యలతో బాధపడే వారు కూడా నేరేడు పండ్లను అసలు తీసుకోకూడదట. దీనివలన డయాబెటిస్, అల్సర్ సమస్యలు అధికమవుతాయి. కొంతమందికి వాంతులు, వీరేశనాలు అధికంగా అవుతాయి. అలాంటి వారు నేరేడు పండ్లను అస్సలు తీసుకోకూడదు. ఇక మరికొంతమంది ప్రయాణ సమయంలో నేరేడు పండ్లను తినడానికి ఆసక్తిని చూపిస్తారు. కానీ నేరేడు పండ్లను ప్రయాణాల సమయంలో అసలు తీసుకోకూడదట.

దీని వల్ల వాంతులు, వీరేచనాలు అవుతాయి. ఇక నేరేడు పండ్లను అధికంగా తినడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండ్లను పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. సీజన్ వచ్చింది కదా అని అధికంగా తినకూడదు. అంతే కాకుండా ఇవి ఎక్కువగా లభ్యమవుతున్నాయని తిన్నట్లయితే అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని వైద్యులు సూచనలు చేస్తున్నారు. చిన్నపిల్లలకు కూడా నేరేడు పండ్లను తినిపించకపోవడమే మంచిది. ఎందుకంటే చిన్నపిల్లలకు నేరేడు పండ్లను తినిపించినట్లైతే వారికి జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. దానివల్ల కడుపులో నొప్పి, మంట వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *