Garlic, Onions:ఉల్లి, వెల్లుల్లి కలిపి తింటున్నారా… అయితే ఇఇ తెలుసుకోండి ?
Garlic, Onions: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని చాలామంది అంటూ ఉంటారు. ఉల్లిపాయ కేవలం ఆరోగ్యాన్ని కాకుండా అందాన్ని కూడా పెంచుతుంది. దాంతో కూరగాయలు చాలా రుచిగా తయారవుతాయి. ఉల్లి పాయలో ప్లేగు వ్యాధిని నియంత్రించే సామర్థ్యం కలదు. ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఘాటు అధికంగా ఉంటుంది.

Do you eat onion and garlic together
ఉల్లిపాయను సాంబార్, పకోడీ, బిర్యానీ, ఉప్మా, కూరలు ఇలా ఎందులోనైనా ప్రతి ఒక్కదానిలో తప్పకుండా వేస్తారు. ఇంకా చాలా రకాల వంటకాలలో ఉల్లిపాయలను నేరుగా తింటూ ఉంటారు. ఉల్లిపాయను పప్పులలో కూడా వేసి వంట చేస్తూ ఉంటారు. వెల్లుల్లి, ఉల్లి ఇవి రెండు ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి. వీటిని కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఇది తరచుగా అనారోగ్యానికి గురయ్యే వారిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తుంది. ఉల్లిపాయ, వెల్లుల్లి ఈ రెండు కూడా వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల ముడతలు, ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. బరువు తగ్గాలనుకునేవారు ఉల్లి, వెల్లుల్లి తప్పకుండా తినాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ సమస్యలు తొలగిపోతాయి. సులభంగా బరువు తగ్గుతారు.