Daku Maharaj: డాకు మహారాజ్ లో నటించిన చిన్నారి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.?
Daku Maharaj: ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12న విడుదలైన బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ గేమ్ చేంజర్ సినిమాని వెనక్కి నెట్టిందని చెప్పుకోవచ్చు.ఈ సినిమా మొదటి షో తోనే బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకొని నందమూరి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందించింది.. డైరెక్టర్ బాబి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమాపై ఎన్నో అంచనాలు పెంచేశారు. అలా ఈ సినిమా విడుదలై అంచనాలను అందుకుంది.
Do you know the background of Chinnari who acted in Daku Maharaj
బాలకృష్ణ హీరోగా చేసిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్,ఊర్వశి రౌటేలాలు నటించారు. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, డైలాగ్ అన్ని సినిమా విడుదలకు ముందే మంచి హైప్ తెచ్చుకోవడం తో సినిమాకి భారీ గ్రాఫ్ పెరిగింది. అయితే ఈ సినిమాలో కూడా బాలకృష్ణ పాప సెంటిమెంట్ నే వాడుకున్నారు. అలా అఖండ, భగవంత్ కేసరి సినిమాల తర్వాత మళ్లీ పాప సెంటిమెంట్ ని వాడుకున్న బాలకృష్ణకి కలిసి వచ్చింది అని చెప్పుకోవచ్చు.(Daku Maharaj)
Also Read: Soundarya: సౌందర్య మరణం లో బయటపడ్డ షాకింగ్ నిజం.. చనిపోయిన ఇన్ని రోజులకు.?
డాకు మహారాజ్ మూవీలో కూడా పాప సెంటిమెంటే ఉంటుంది. అయితే ఈ సినిమాలో బాలకృష్ణతో నటించిన చిన్నారి సినిమా షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్లే సమయంలో ఎమోషనల్ అయ్యి బాలయ్యని పట్టుకొని ఏడ్చిన వీడియో ఇప్పటికే నెట్టింట వైరలైన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాలో చేసిన చిన్నారి ఎవరు అని తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్స్. ఇక డాకు మహారాజ్ సినిమాలో నటించిన చిన్నారి పేరు వేద అగర్వాల్.
ఈమె తండ్రి కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాడే. ఎందుకంటే ఆయన సింగర్ తండ్రి పేరు మాధవ్.. తల్లి పేరు మేఘ.. ఈ పాప తండ్రి మాధవ్ సింగర్ గానే కాకుండా మ్యూజిక్ కంపోజర్ గా కూడా వర్క్ చేస్తారు. వేద అగర్వాల్ తండ్రి మాధవ్ భజన్,తుమ్రి, గజల్ లో మాస్టర్.. అంతేకాకుండా ఈయన IIMA అవార్డుల్లో బెస్ట్ సింగర్ గా నామినేట్ అయ్యి పాపులర్ సింగర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక డాకు మహారాజ్ సినిమాలో వేద అగర్వాల్ నటనకి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. ఈ సినిమాతో ఈ పాపకి మరిన్ని అవకాశాలు వస్తాయని తెలుస్తోంది.(Daku Maharaj)