Pushpa-2: పుష్ప-2 లో బాబాయ్ అంటూ పుష్పరాజ్ ని పిలిచిన ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
Pushpa-2: పుష్ప.. పుష్ప.. పుష్ప.. ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతుంది. పుష్ప చిత్రానికి ముందు ఒక లెక్క పుష్ప సినిమా తర్వాత మరో లెక్క అనే విధంగా అల్లు అర్జున్ జీవితం మారిపోయింది. పుష్ప1,2 చిత్రాల ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ఈయనకే కాకుండా ఈ సినిమా తీసిన డైరెక్టర్ సుకుమార్ కు మరియు ఇతర క్యారెక్టర్లు చేసిన వారికి కూడా ఎంతో గుర్తింపు వచ్చింది.
Do you remember that heroine who called Pushparaj as Babai in Pushpa-2
అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ హీరోయిన్ గురించే, ఈమె పుష్ప 2 సినిమాలో పుష్పరాజు అన్నగా నటించిన అజయ్ కి కూతురిగా నటించింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే తెలుగులోని పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసిందట. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆ వివరాలు ఏంటో చూద్దాం.. “సమోసా తింటావా శిరీష” అనే డైలాగ్ వినగానే ఇది ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. అయితే ఆ సినిమా ఏంటో తెలియకపోయినా కానీ ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది.. (Pushpa-2)
Also Read: Pushpa-2: అల్లు అర్జున్ అరెస్ట్.. పుష్ప-2 నిలిపివేయాల్సిందే.?
అలాంటి డైలాగ్ ద్వారా కాస్త గుర్తింపు పొందినటువంటి హీరోయిన్ ఎవరయ్యా అంటే పావనీకరణం. తెలంగాణలో పుట్టినటువంటి ఈమె సినిమాల మీద ఆసక్తితో హైదరాబాదులో అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రలు చేస్తూ తన కెరీర్ మొదలు పెట్టింది.. అడవి శేషు హీరోగా వచ్చినటువంటి హిట్ 2లో కూడా ఒక చిన్న పాత్ర చేసింది. అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత తిరువీర్ హీరోగా వచ్చిన పరేషాన్ అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలో హీరోయిన్ గా చేసింది.
ఇందులోనే శిరీష పాత్రలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే “పైలం పిల్లగ ” అనే మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాల తర్వాత డైరెక్ట్ గా పుష్ప2 చిత్రంలో మంచి పాత్ర దొరికింది. ఈ పాత్రలో తనదైన శైలిలో పెర్ఫార్మన్స్ చూపించడంతో ‘పావనికరణం’కు గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. మరి ఈ సినిమా తర్వాత అయినా ఆమె కెరియర్ మారిపోతుందా లేదా అనేది చూడాలి..(Pushpa-2)