Nagarjuna: అక్కినేని నాగార్జునకు నిజంగానే తెలుగు ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ అంటే చిన్న చూపా ఎందుకు ఆయన ప్రతి సినిమాకి ముంబై నుండి హీరోయిన్స్ ని రప్పించుకుంటారు. ఇందులో ఉన్న అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలు తమ కూతుర్లను ఇండస్ట్రీకి పంపడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది వాళ్ళు దగ్గరుండి చూస్తారు కాబట్టి.
Does Nagarjuna like Mumbai heroines
నిర్మాతల గానో లేక డైరెక్టర్లు గానో లేదా వేరే ఇతర రంగాల్లోనైనా సెటిల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే మంచు లక్ష్మి హోస్టుగా చేసిన ఓషోకి నాగార్జున గెస్ట్ గా వచ్చారు. ఇక ఈ షో కి వచ్చాక మా నాన్న మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగమన్నారు. అదేంటంటే..నాగార్జున ఎందుకు ఎప్పుడైనా ముంబై హీరోయిన్స్ ని ఇక్కడికి తెచ్చుకుంటారు.(Nagarjuna)
Also Read: Devara: జాన్వీ ను ఎంత వాడాలో అంత వాడుకున్నట్లుంది!!
తెలుగులో ఉన్న హీరోయిన్స్ ఆయనకునచ్చరా అని అడగమన్నారు అని మంచు లక్ష్మి నాగార్జునని అడిగేసింది. దీనికి నాగార్జున మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. కానీ వాళ్లు అన్ని పాత్రలకు ముందుకు రారు. కానీ ముంబై హీరోయిన్స్ అయితే అన్ని చేస్తారు. అయితే వారితో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి.వారికి సంబంధించి అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. తెలుగు రాదు షూటింగ్స్ సమయంలో ఇబ్బంది పెడుతుంటారు. కానీ మన తెలుగు హీరోయిన్స్ కొన్నింటికి భయపడతారు.
ఒకవేళ నాకే గనుక కూతురు ఉంటే కచ్చితంగా నేను హీరోయిన్ గా ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసేవాడిని. ఇక తెలుగులో ఉండే అమ్మాయిలు మాత్రమే కాదు ఇప్పటి యంగ్ జనరేషన్ కూడా కొన్ని ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి భయపడుతున్నారు. అందుకే నాకు ఇప్పటి జనరేషన్ నచ్చడం లేదు. అయితే అందరూ కాదు కొంతమంది అలా చేస్తున్నారు అంటూ నాగార్జున ఆసక్తికర కామెంట్స్ చేశారు.(Nagarjuna)