Soundarya: ఇండస్ట్రీలో సౌందర్యను రీ ప్లేస్ చేసే సత్తా ఒక్క ఆ హీరోయిన్ కే ఉందా.?
Soundarya: సినిమా ఇండస్ట్రీ అంటేనే చెరువులోని నీళ్ల లాంటిది. కొత్తనీరు వచ్చే కొలది పాతనీరు అనేది బయటకు వెళ్తూ ఉంటుంది. ఆ విధంగా ఇండస్ట్రీలో కొత్త వాళ్లు వచ్చే కొలది పాత వాళ్లకు ఛాన్సులు తగ్గుతూ ఉంటాయి. కానీ కొంతమంది హీరో హీరోయిన్లు మాత్రం ఎన్ని ఏళ్లయిన వారి నటనను మర్చిపోనివ్వకుండా బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు. అలా బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఇండస్ట్రీలో ఎదిగిన హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సౌందర్య..
Does that heroine alone have the power to replace Soundarya in the industry
అలాంటి సౌందర్య మరియు వెంకటేష్ కాంబో అప్పట్లో సూపర్ డూపర్ హిట్. వీరి కాంబినేషన్లో సినిమా వచ్చింది అంటే తప్పకుండా అభిమానులకు ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. ఆ విధంగా సినిమాల్లో భార్యాభర్తల పాత్రలు అంటే సౌందర్య ఎంతో చక్కగా చేసేది. అలాంటి సౌందర్య ప్లేసును తాజాగా ఈ హీరోయిన్ భర్తీ చేసిందని చెప్పవచ్చు.. తాజాగా వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలుసు.(Soundarya)
Also Read: Allu Arjun: మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరమైనట్టేనా.. సంక్రాంతి వేడుకలకు దూరంగా.?
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా చేసారు. ఇందులో ఐశ్వర్య వెంకటేష్ భార్య పాత్రలో అద్భుతంగా నటించింది అని చెప్పవచ్చు.. ఈమె నటనను చూసి వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ ఎలా ఉండేదో అంతకంటే ఎక్కువ డెప్త్ లో ఐశ్వర్య రాజేష్ చేసిందని అంటున్నారు.
సౌందర్య చనిపోయిన తర్వాత వెంకటేష్ పక్కన ఆ విధంగా నటించిన హీరోయిన్ ఇప్పటివరకు లేదు. ఇప్పుడు ఆ ప్లేసును ఐశ్వర్య రాజేష్ భర్తీ చేసిందని, వీరి కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు కూడా చూడాలని జనాలు అనుకుంటున్నారట. ఈ విధంగా జనాలకు ఎంతో కనెక్ట్ అయినటువంటి ఈ కాంబినేషన్ లో ఫ్యూచర్లో ఇంకేమైనా సినిమాలు వస్తాయా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.(Soundarya)