Sobhan Babu: జయలలిత మాత్రమే కాదు ఆ హీరోయిన్ కూడా శోభన్ బాబుని పెళ్లి చేసుకోవాలనుకుందా.?


Does that heroine also want to marry Sobhan Babu

Sobhan Babu: శోభన్ బాబు పేరు వినపడగానే అందరికీ గుర్తుకొచ్చేది హీరోయిన్ జయలలిత.. దివంగత నటి మాజీ తమిళనాడు సీఎం అయినటువంటి జయలలిత శోభన్ బాబును అమితంగా ప్రేమించింది. పెళ్లి వరకు వెళ్లారు. కానీ ఆమె దురదృష్టం ఏమో కానీ ఆయనకు ప్రియురాలు అయ్యే భాగ్యం దక్కింది కానీ భార్య అయ్యే అదృష్టం మాత్రం దక్కలేదు.అలా చివరి వరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జయలలిత తన జీవితాన్ని ముగించింది.

Does that heroine also want to marry Sobhan Babu

అయితే అలాంటి జయలలితతో పాటు మరో హీరోయిన్ కూడా శోభన్ బాబుని పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ఆశపడిందట. కానీ ఆ హీరోయిన్ కూడా శోభన్ బాబు పెళ్లి చేసుకోలేదు. చివరికి మరో హీరోని పెళ్లాడి తన బతుకుని ప్రశ్నార్థకంగా మార్చుకుంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే సీనియర్ నటి శారద.. హీరోయిన్ శారద అంటే తెలియని వారు ఉండరు.ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్గా ఆ తర్వాత తల్లి,అత్త, బామ్మ పాత్రలు చేసి చాలా పాపులర్ అయింది. (Sobhan Babu)

Also Read: Tamannaah: ప్రియుడితో బ్రేకప్.. ఆ నిర్మాతతో తమన్నా హాట్ ఫొటోస్.?

ముఖ్యంగా మదరిండియా, మాతృదేవోభవ వంటి సినిమాలు శారద జీవితాన్ని మలుపు తిప్పాయని చెప్పుకోవచ్చు.అయితే అలాంటి శారద శోభన్ బాబు కాంబోలో కూడా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు వచ్చాయి. అలా సినిమాలు చేసిన సమయంలో శోభన్ బాబు ప్రేమలో శారద పడిపోయింది.అంతేకాదు శారద శోభన్ బాబుని పడేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించిందట. కానీ శోభన్ బాబు మాత్రం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండేవారట.

Does that heroine also want to marry Sobhan Babu

అలా ఎన్నిసార్లు శోభన్ బాబుని అట్రాక్ట్ చేయాలని చూసినా కూడా కుదరలేదట.దాంతో చివరికి నటుడు చలం ప్రేమలో పడి ఆయనే పెళ్లి చేసుకుంది. అయితే చలంకి అప్పటికే పెళ్లయింది. కానీ భార్య చనిపోవడంతో ఒంటరి జీవితాన్ని కొనసాగించాడు. అలా చలం శారద ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ వీరిద్దరి మధ్య బంధం అర్ధాంతరంగా ముగిసింది. చలం తాగుడు కి బానిసై శారదను హింసించడంతో ఆమె చలంకి విడాకులు ఇచ్చేసి పెళ్లి పై విరక్తి పుట్టి చివరికి రెండో పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది.(Sobhan Babu0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *