Hansika: హన్సికకు లీగల్ షాక్.. ముంబై కోర్టులో హాట్ హీరోయిన్!!

Hansika: ప్రముఖ సినీ నటి హన్సిక మోత్వానీ తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలని కోరుతూ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఆమె సోదరుడు ప్రశాంత్ మోత్వానీ భార్య ముస్కాన్ నాన్సీ జేమ్స్ ఫిర్యాదుతో నమోదైంది. తనతో పాటు తల్లి జ్యోతిలపై కూడా తప్పుడు ఆరోపణలు చేసారని హన్సిక తన పిటిషన్‌లో పేర్కొన్నారు. Domestic Violence Act కింద నమోదైన ఈ కేసు ఇప్పుడు హైప్రొఫైల్ లీగల్ బటిల్‌గా మారింది.
Domestic Violence Case Against Hansika
హన్సిక సోదరుడు ప్రశాంత్ 2020లో టీవీ నటి ముస్కాన్‌తో వివాహం చేసుకున్నారు. కానీ, వారి వివాహ జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్న వీరిద్దరి మధ్య కుటుంబ వివాదం తారాస్థాయికి చేరింది. ముస్కాన్ తనను 20 లక్షల రూపాయలు ఇవ్వాలని హన్సిక డిమాండ్ చేసిందని, అత్తగారింట్లో వేధింపులకు గురి చేసారని ఆరోపించింది. ఈ ఆరోపణల ఆధారంగా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
2025 ఫిబ్రవరిలో, ముంబై సెషన్స్ కోర్టు హన్సిక తల్లి, కూతుళ్లకు అంతిమ బెయిల్ మంజూరు చేసింది. అయితే తాము నిర్దోషులమని, ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ ముంబై హైకోర్టును హన్సిక ఆశ్రయించారు. జస్టిస్ సారంగ్ కోత్వాల్, జస్టిస్ ఎస్.ఎం. మోదక్ ధర్మాసనం ముస్కాన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 3, 2025 న జరగనుంది.
హన్సిక సోదరుడు ప్రశాంత్ తన భార్య తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. పెళ్లి సమయంలో 27 లక్షలు వెడ్డింగ్ ఖర్చు చేశానని, ఇప్పుడు విడాకుల కారణంగా ఆ డబ్బు అడిగితే తప్పుడు కేసు వేసిందని అన్నారు. తనపై పెట్టిన కేసు పూర్తిగా అబద్ధమని కోర్టు తమకు న్యాయం చేయాలని హన్సిక ఆశిస్తున్నారు.