Paper Cup: పేపర్ కప్పులలో టీ, కాఫీ తాగుతున్నారా.. అయితే డేంజర్ ?

Paper Cup: టీ, కాఫీలను చాలామంది బయట తాగడానికి ఇష్టపడతారు. దీనికి ప్రధాన కారణం ఇంట్లో టీ, కాఫీల కన్నా బయట తాగే టీ, కాఫీలు చాలా రుచిగా ఉంటాయి. కానీ బయట సేవించే టీ, కాఫీలను పేపర్ కప్పులు, గ్లాసులలో పోసి ఇస్తారు. వీటి వాడకం నేటి కాలంలో చాలా పెరిగిపోయింది. వీటిని కడిగే పని ఉండదని అనుకుంటారు. కానీ పేపర్ కప్పులు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వైద్య, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. Paper Cup

Dont Drink tea coffe in Paper Cup

పేపర్ కప్పులో వేడి పానీయాలు పోసినట్లయితే పేపర్ పై ఉన్న ప్లాస్టిక్ కోటింగ్ కరిగే అవకాశాలు ఉంటాయి. ఈ ప్లాస్టిక్ తరచుగా పాలిఎతిలిన్, పాళి ప్రోపిలిన్ వంటి పదార్థాలతో తయారుచేస్తారు. ఇవి కరిగిన సమయంలో సూక్ష్మ పరిమాణంలో రసాయనాలు వేడిగా ఉండే కాఫీ లేదా టీలపై పడుతుంది. కొన్ని పేపర్ కప్పులు అధిక ఉష్ణోగ్రతలకు గురైన సమయంలో విష పదార్థాలను విడుదల చేస్తాయి. ఇది క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. పేపర్ కప్పులు పర్యావరణానికి కూడా చాలా హానికరం. పేపర్ కప్పులు వేడి కాఫీ, టీలు తాగిన సమయంలో ప్లాస్టిక్ అయాన్లతో పాటు భారీ లోహాలతో మిళితమై ఉంటాయి. Paper Cup

Also Read: KCR: కేసీఆర్ టచ్ లోకి బిజెపి నేతలు… ప్లాన్ B అదుర్స్ ?

వాటిని సేవించడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. పేపర్ కప్పులు, గ్లాసులకు ఉండే పై పొరలో ప్లాస్టిక్ అయాన్లతో పాటు మాంగనీస్, జింక్, కాడ్మియం, క్రోమియం, పల్లడియన్ వంటి లోహాలు ఉంటాయి. పేపర్ కప్పుల వాడకం ముఖ్యంగా నరాలకు సంబంధించిన జబ్బులైన పక్షపాతం, సంతానలేమి సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలను తీసుకువస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పేపర్ కప్పుపై డిజైనర్ లో రసాయనాలు ఉంటాయి. దీని వల్ల శరీరంలో టాక్సిన్ పేరుకపోవడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు ఇది స్లో పాయిజన్ గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బయట టీ, కాఫీలు తాగడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు సూచనలు చేస్తున్నారు. Paper Cup

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *